మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాలతో సంచలనాలకు తెర తీస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో `అంతరిక్షం` లాంటి ప్రయోగం ఫెయిలైనా అతడు తన బాటను విడువడం లేదు. ప్రస్తుతం బాక్సర్ గా అసాధారణ ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి సారి అతడు బాక్సర్ పాత్రలో కనిపిస్తున్నందున గని మూవీపై అంచనాలు అదే రేంజులో ఉన్నాయి. ఇక ఈ మూవీలో భీకరంగా కనిపించేందుకు వరుణ్ చాలా కసరత్తులు చేసారు. జిమ్ లో నిరంతరం కసరత్తులు చేస్తూ ఆకారాన్ని పూర్తిగా మార్చేసాడు. ప్రస్తుతం అతడు బీస్ట్ ని తలపిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. గని చిత్రానికి కిరణ్ కుమార్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. `దబాంగ్ 3` ఫేం సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రినైసాన్స్ పిక్చర్స్- అల్లు బాబి కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్దా- అల్లు బాబీ నిర్మిస్తున్నారు. మూవీ అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
వరుణ్ తేజ్ తదుపరి వెంకీతో కలిసి ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నారు. అనీల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా తమన్నా- మెహ్రీన్ తదితరులు నటిస్తున్నారు. అలాగే వరుణ్ బాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఓ అగ్ర నిర్మాణ సంస్థ వరుణ్ ని లాంచ్ చేయడానికి సిద్దంగా ఉందని తెలిసింది. వరుణ్ తేజ్ ఇప్పటికే తెలుగులో పాపులర్ స్టార్. కమర్శియల్ చిత్రాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి బెస్ట్ పెర్పామర్ గా నిరూపించుకున్నారు. ప్రస్తుతం వరుణ్ మార్కెట్ డబుల్.. ట్రిపుల్ అయింది. ఒక్కో సినిమాకు 15 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. ఇదే అదనుగా వరుణ్ హిందీ చిత్రాలపై కూడా దృష్టి పెట్టారని గుసగుస వినిపిస్తోంది.
ఓ కొత్త దర్శకుడితో హిందీ- తెలుగు ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నారని తాజాగా తెలిసింది. ఆ యంగ్ డైరెక్టర్ పేరు ఎక్కడా రివీల్ కాలేదు గానీ ప్రాజెక్ట్ మాత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. దర్శకుడు వినిపించిన స్క్రిప్ట్ వరుణ్ కి బాగా నచ్చి వెంటనే లాక్ చేసాడు.ఈ సినిమా కథ యూనిక్ గా ఉంటుంది. కథనం ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కాదని...కేవలం హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసి రూపొందించే చిత్రమని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సోని పిక్చర్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇదే సంస్థ అడవిశేషు ని హీరోగా హిందీ లాంచింగ్ మూవీ `మేజర్`ని నిర్మిస్తోంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు హీరోల్ని సోనీ పిక్చర్స్ బాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతల్ని తీసుకోవడం విశేషం. ఇక మునుముందు వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ లో ఇతర అగ్ర హీరోలకు పోటీనిచ్చేంత పెద్ద స్టార్ డమ్ ని అందుకుంటాడనడంలో సందేహమేం లేదు.