ఇళయరాజా తర్వాత జిబ్రానే

Update: 2015-04-10 23:30 GMT
జిబ్రాన్‌.. అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో ఈ పేరు ఇప్పుడో సంచలనం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండ్‌ ఈ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ టాలెంట్‌ చూసి పిచ్చెక్కిపోయి వరుసగా మూడు సినిమాలు అతడికే అప్పగించేశాడు. విశ్వరూపం-2తో పాటు ఉత్తమ విలన్‌, పాపనాశం సినిమాలకు జిబ్రాన్‌తోనే మ్యూజిక్‌ చేయించుకున్నాడు. ఇప్పుడిక కమల్‌ నాలుగో సినిమాకు కూడా అతనే మ్యూజిక్‌ ఇవ్వబోతున్నాడు. కమల్‌ ఇలా వరుసగా నాలుగు సినిమాలు చేసింది ఒక్క ఇళయారాజాతో మాత్రమే.

ఈ రోజుల్లో ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌తో వరుసగా రెండు సినిమాలు చేయడమే విశేషమంటే.. వరుసగా నాలుగు సినిమాలంటే చిన్న విషయం కాదు. కమల్‌కు జిబ్రాన్‌ మీద ఎంత గురి ఉందో దీన్ని బట్టే చెప్పేయొచ్చు. విదేశాల్లో మ్యూజిక్‌ యూనివర్శిటీలకు వెళ్లి సంగీతం నేర్చుకుని వచ్చిన జిబ్రాన్‌ జాతీయ అవార్డు అందుకున్న 'వాగై సూడ వా' అనే సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమయ్యాడు.

విశ్వరూపం షూటింగ్‌ సమయంలో కమల్‌ ఈ సినిమా పాటలు విని ఆశ్చర్యపోయారట. యూనిట్‌ సభ్యులందరికీ ఈ పాటలు వినిపించి జిబ్రాన్‌ గురించి గొప్పగా పొగిడారట. అంతటితో ఆగకుండా జిబ్రాన్‌తో వరుసగా సినిమాలు ఇచ్చాడు కూడా. కమల్‌తో మూడు సినిమాలనగానే అందరి కళ్లూ జిబ్రాన్‌పై పడ్డాయి. తెలుగులోనూ రన్‌ రాజా రన్‌, జిల్‌ లాంటి మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చి పెద్ద డైరెక్టర్లు, నిర్మాతల్ని ఆకర్షించాడీ కుర్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌. త్వరలోనే అతను టాలీవుడ్‌లో పెద్ద ప్రాజెక్టులకు పని చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News