యూఎస్ ఏ - జులై 21 - 2016: అమెరికాలో శరవేరగంగా విస్తరిస్తున్న దక్షిణ భారత ఆహారం అందించే రెస్టారెంట్ చెయిన్ ‘గోదావరి’ ఇప్పుడు దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో అతిపెద్ద సినిమా అయినా కబాలికి ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ మెగా మూవీని న్యూఇంగ్లాండ్ - డెలావర్ ప్రాంతంలోని 15 స్క్రీన్లపై చూడొచ్చు.
ఈ ప్రాంతంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన భారతీయ సినిమా ఇదే. కాగా ఈ సందర్భంగా గోదావరి బృందం మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో భారతీయ చిత్రం కబాలిని మేం ప్రమోట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అమెరికాలో నివసించే భారతీయుల్లో కబాలి సినిమా అన్నా - రజనీకాంత్ అన్నా విపరీతమైన క్రేజ్ ఉండడంతో కబాలి - గోదావరి కాంబినేషన్ బ్రహ్మాండమైన విజయం అందుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొంది.
అమెరికాలోని మషాచూషెట్స్ - కనెక్టికట్ - రోడ్ ఐలాండ్ - న్యూ హ్యాంప్ షైర్ - మైన్ - డెలావర్ రాష్ట్రాల్లో గోదావరి రెస్టారెంట్సు కబాలి సినిమాను విడుదల చేస్తోంది. అన్ని ప్రాంతాల్లో రజనీ అభిమానులు - భారతీయులు ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే అనేక రికార్డులు బద్ధలు కొడుతున్న కబాలి అమెరికాలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నారు.
కాగా మైన్ లో విడుదల అవుతున్న తొలి భారతీయ చిత్రం కబాలియే కావడం మరో విశేషం. అమెరికాలో అక్కడి కాలమానం ప్రకారం జులై 21వ తేదీ మద్యాహ్నం 11.45 గంటలకే తమిళ - తెలుగు భాషల్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయి.
కబాలిని గోదావరి రెస్టారెంట్స్ విడుదల చేస్తున్న ఈ రాష్ట్రాల్లో తమిళంలో 45 - తెలుగులో 26 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. బోస్టన్ లోని యాపిల్ సినిమాస్ లో మంచి భారతీయ భోజనం కూడా అందుబాటులో ఉంది. నోరూరించే భారతీయ వంటకాలు ఎన్నో అక్కడ ఉన్నాయి.
ఇప్పటికే గోదావరి రెస్టారెంట్లు అమెరికా అంతటా ఉన్నాయి. కొత్తగా మోరిస్ విల్లేలో ఈ నెలాఖరుకు.. హార్ట్ ఫోర్డ్ - ఫ్రామింగ్ హామ్ - న్యూ హ్యాంప్ షైర్ లలో వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి.
‘‘గోదావరి ప్రొడక్షన్స్’’ పేరుతో సినిమా రంగంలోనూ అడుగుపెడుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ ను - ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడానికి - వారి సృజనను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది.
గోదావరి రెస్టారెంట్లు రిలీజ్ చేస్తున్న కబాలి ఎక్కడెక్కడ ఆడుతుందో తెలుసుకోవాలంటే.. www.GodavariUS.com లో చూడొచ్చు.
Press note released by: Indian Clicks, LLC