సాధారణంగా టీజర్ సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేసే విధంగా కట్ చేస్తారు. ఆ సినిమా కాన్సెప్ట్ ను ప్రేక్షకులను పరిచయం చేస్తారు. కానీ టీజర్ చూపించిన ఒక్క నిమిషంలో ప్రేక్షకులను ఆలోచింపజేయడం అంటే అరుదనే చెప్పాలి. వరసగా వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ గోల్డ్ టీజర్ గ్యారంటీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గోల్డ్ మూవీ హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి రోజుల్లో ఈ స్టోరీ నడుస్తుంది. గోల్డ్ టీజర్ ప్రారంభంలోనే జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలుచోండి అని కనిపిస్తుంది. ఇంతలో బ్రిటిష్ జెండా ఎగురుతుండగా.. ఆ దేశ జాతీయ గీతం వినిపిస్తుంది. ఇంతలోనే ఇది మీకెలా అనిపించిందనే ప్రశ్న తెరపై కనిపిస్తుంది. దాదాపు 200 సంవత్సరాలపాటు బ్రిటిష్ జాతీయ గీతానికి మనం ఇలాగే లేచినుంచున్నాం. ఒకడి కలతో బ్రిటిష్ వాళ్లు మన జాతీయ గీతానికి లేచి నుంచున్నారు అంటూ ఈ సినిమా వెనుక దేశభక్తి కోణాన్ని చూపిస్తుంది.
1948 లో సమ్మర్ ఒలింపిక్స్ లో ఇండియా హాకీలో బంగారు పతకం దక్కించుకుంది. స్వతంత్ర దేశంగా అంతర్జాతీయ వేదికపై ఇండియా దక్కించుకున్న మొదటి పతకం అది. వందేమాతరం అంటూ నినదిస్తుండగా... ఒక్కడు.. కన్నకల దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది అంటూ గోల్డ్ టీజర్ ఇచ్చే ముగింపు ప్రతి ఒక్కరినీ తప్పకుండా మెప్పిస్తుంది.
Full View