నేడే గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్స్‌.. టెన్ష‌న్ లో RRR ఫ్యాన్స్‌!

Update: 2023-01-10 06:36 GMT
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా సంచ‌ల‌నం 'RRR'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది. లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీంల ఫిక్ష‌న‌ల్ స్టోరీ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ ఇది. వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృస్టించిన ఈ మూవీ వ‌సూళ్ల ప‌రంగానూ స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాసింది. ఇక అవార్డుల ప‌రంగానూ ఇదే జోరుని చూపిస్తూ అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో దూసుకుపోతోంది.

ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పలు అవార్డుల్ని ద‌క్కించుకుంటూ స‌త్తా చాటుతున్న'RRR' హాలీవుడ్ మేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ 'RRR' ఎంట్రీని సాధించిన విష‌యం తెలిసిందే. రెండు విభాగాల్లోనూ అవార్డు కోసం పోటీప‌డుతున్న 'RRR' 'నాటు నాటు పాట‌కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ ప‌రంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ప‌లువురు విమ‌ర్శ‌కులు, హాలీవుడ్ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తున్నారు.

ఇదిలా వుంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఈ రోజు అమెరికాలో జ‌రగ‌నున్నాయి. ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు వేడుక‌ల్లో RRR టీమ్ పాల్గొంటున్న విష‌యం తెలిసిందే.  గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు విభాగాల‌లో RRR నామినేష‌న్స్ ని సాధించింది. బెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ ఆఫ్ పారిన్ మూవీస్ కేట‌గిరిలో RRR పోటీప‌డ‌నుంది. అంతే కాకుండా బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ విభాగంలోనూ 'నాటు నాటు' సాంగ్ కి గానూ RRR పోటీకి ఎంపికైన విష‌యం తెలిసిందే.

ఈ రెండు విభాగాల్లో RRR కు ఖ‌చ్చితంగా ఏదో ఒక అవార్డు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో ఎన్టీఆర్ అభిమానులు గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్‌, రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్ పాల్గొంటున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు లాస్ ఏంజిల్స్ లో భారీ స్థాయిలో సంబ‌రాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ హోర్డింగ్స్ తో పాటు పెద్ద పెద్ద ట్ర‌క్కుల్లో లెడ్ లైట్ ల‌ని ఏర్పాటు చేశార‌ట‌.

అంతా బాగానే వున్నా ఫ్యాన్స్ లో ఏం జ‌ర‌గ‌నుందోన‌నే టెన్ష‌న్ మొద‌లైన‌ట్టుగా చెబుతున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR కు అవార్డు ద‌క్కితే ఆస‌కార్ అవార్డుల్లో ఏదో ఒక విభాగంలో అవార్డు ద‌క్క‌డం కాయం అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News