మహానటి చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకుంది కీర్తి సురేష్. ప్రముఖ నటి మేనక కుమార్తెగా పరిశ్రమకు పరిచయమైనా అనతి కాలంలోనే గొప్ప నటి అన్న పేరు తెచ్చుకుంది. కీర్తి సురేష్ ఎంతో గొప్ప పరిణతి ఉన్న నటీమణిగా తెలుగు చిత్ర సీమలో పాపులరైంది.
ఇక కీర్తి కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా తనకు వంద శాతం గ్లామరస్ పాత్రలు సూట్ కావడం లేదు. కానీ ఇటీవల జీరో సైజ్ కోసం ట్రై చేసి కొంత భంగపడినట్టు అనిపించింది. తిరిగి నెమ్మదిగా లుక్ పరంగా ఛేంజెస్ చూపిస్తోంది. పనిలో పనిగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్ ని రివీల్ చేస్తోంది.
తాజాగా గుడ్ హెయిర్ డే! అంటూ శిరోజాల్ని ఆరబోసిన ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. గుడ్ హెయిర్ వైబ్స్.. గుడ్ హెయిర్ గుడ్ లైఫ్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని వైరల్ చేస్తోంది కీర్తి. ఇక ఈ ఫోటోలో మేకప్ లెస్ లుక్ తోనూ కనిపించింది. కీర్తి ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనడంలో సందేహమేం లేదు. ఆ రింగుల జుత్తు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక నితిన్ సరసన నటించిన రంగ్ దే రిలీజ్ కి రెడీ అవుతుంటే .. తదుపరి క్రేజీగా సర్కార్ వారి పాట చిత్రీకరణలోనూ కీర్తి పాల్గొంటోంది.