కీర్తి సురేష్ `మహానటి` బ్లాక్ బస్టర్ తరువాత వరుసగా మహిళా ప్రధాన చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఆమె వీటికే ఫిక్సయిపోయిందా అని అంతా అనుమానం వ్యక్తం చేశారు కూడా. తెలుగు, తమిళ భాషల్లో ఆమె చేసిన సినిమాలని చూశాక ప్రతీ ఒక్కరూ ఇదే డౌట్ ని రైజ్ చేశారు. అయితే తాను చేసిన తప్పుని తెలుసుకున్న కీర్తి సురేష్ వెంటనే ట్రాక్ మార్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట`కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇదిలా వుంటే కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ కథతో చేసిన ఓ చిత్రం గత కొంత కాలంగా కోవిడ్ వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. దీన్ని చివరికి ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీని మేకర్స్ థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు. అదే `గుడ్ లక్ సఖి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.
గత ఏడాదే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 28న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దిల్‌రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ ఓ దురదృష్టవంతురాలైన తెలంగాణ యువతిగా కనిపించబోతోంది. జాతీయ స్థాయిలో షూటర్ గా నిరూపించుకోవాలన్న ఆమె కోరిక నెరవేరిందా? .. చివరికి ఏం జరిగింది? అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ గిరిజన యువతిగా కనిపించింది. ఓ సాధారణ యువతి తన అసాధారణ ప్రతిభతో షూటర్ గా జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది అనే కథతో దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించారు. చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మూవీని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.