టాలీవుడ్ మాచో మ్యాన్ దగ్గుబాటి రానా హీరోగా నటించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. శ్రీ విష్ణుతో తొలి ప్రయత్నంగా 'నీది నాది ఒకే కథ' అంటూ సరికొత్త నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య సాగే కథగా రూపొందించిన ఈ మూవీతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో సరికొత్త నేపథ్యంలో మలి ప్రయత్నంగా వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం 'విరాటపర్వం'. క్రేజీ నటి సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీని జూలై 1న విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ డేట్ ని మార్చి రానా - సాయి పల్లవి అబిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకుని గత ఏడాది ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ఇంత వరకు రిలీజ్ కాకపోవడంతో ఈ మూవీ రిలీజ్ పై పలు వార్తలు పుట్టుకొచ్చాయి. కరోనా ప్రభావం తగ్గి క్రేజీ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో దేశ వ్యాప్తంగా సందడి చేస్తున్నా 'విరాట పర్వం' రిలీజ్ కు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని మేకర్స్ వెల్లడించలేదు.
దీంతో ఈ మూవీ ఇంతకీ విడుదలవుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. థియేటర్లలో ఈ మూవీ విడుదల కావడం లేదని, ఈ సినిమాని ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. అయినా సరే ఈ వార్తలపై మేకర్స్ స్పందించలేదు. ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో 'విరాటపర్వం' థియేటర్లలోకి రావడం లేదని, ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతూ 'విరాటపర్వం' మేకర్స్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మూవీని జూలై 1న విడుదల చేస్తున్నామంటూ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.
55 రోజుల ముందు రిలీజ్ డేట్ ని ప్రకటించడం ఏంటీ? ఈ మధ్య రిలీజ్ లు పెద్దగా లేవు కదా జూన్ లో విడుదల చేస్తే బాగుంటుంది కదా? అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్ లు మొదలయ్యాయి. ఈ కామెంట్ ల నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ విషయంలో మనసు మార్చుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 1న విడుదల చేస్తామంటూ ప్రకటించిన ఈ మూవీ రిలీజ్ ని మేకర్స్ జూన్ రెండవ వారానిక మార్చినట్టుగా తెలుస్తోంది. జూన్ 17న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త నిజంగా రానా - సాయి పల్లవి అభిమానులకు నిజంగా గుడ్ న్యూసే.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. మారిన రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి వుంది. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కామ్రేడ్ రవన్నగా రానా నటించిన ఈ చిత్రంలో అతని విప్లవ రచనలకు ఆకర్షితురాలై అతన్ని వెతుక్కుంటూ అడవి బాట పట్టిన వెన్నెలగా సాయి పల్లవి కనిపించబోతోంది.
భరతక్క పాత్రలో ప్రియమణి నటిస్తుండగా కీలక పాత్రల్లో బాలీవుడ్ నటి నందితా దాస్ కనిపించబోతోంది. ఇతర కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, ఈశ్వరీరావు, సాయి చంద్, నివేదా పేతురాజ్ నటించారు. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీపై అంచనాలు భారీగా వున్నాయి.