చిత్రం: ‘గూఢచారి’
నటీనటులు: అడివి శేష్ - శోభిత దూళిపాళ్ల - జగపతిబాబు - ప్రకాష్ రాజ్ - సుప్రియ - మధుశాలిని - రవిప్రకాష్ - అనీష్ కురువిల్లా - వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: షనీల్ డియో
కథ: అడివి శేష్
మాటలు: అబ్బూరి రవి
స్క్రీన్ ప్లే: శశికిరణ్ తిక్కా - అడివి శేష్ - రాహుల్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: శశికిరణ్ తిక్కా
అడివి శేష్ నటుడు మాత్రమే కాదు.. రచయిత.. దర్శకుడు కూడా. అతను గతంలో స్వీయ దర్శకత్వంలో ‘కర్మ’.. ‘కిస్’ అనే సినిమాలు కూడా తీశాడు. అవి ఆడలేదు. ఆ తర్వాత నటుడిగా బిజీ అయిపోయాడు. చాలా విరామం తర్వాత రచయితగా ‘క్షణం’ అనే కథ రాశాడు. తనే కథానాయకుడిగా నటించాడు. మంచి హిట్టు కొట్టాడు. ఇప్పుడు అతడి కథతో తెరకెక్కిన ‘గూఢచారి’ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించింది. కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్కా రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
గోపి (అడివి శేష్) తండ్రి ప్రత్యేక నిఘా విభాగం ‘త్రినేత్ర’లో పని చేసి ఉగ్రవాదుల చేతిలో హతమవుతాడు. దీంతో అదే విభాగంలో పని చేసే అతడి మావయ్య గోపీని అర్జున్ అనే మారు పేరుతో పెంచుతాడు. ఐతే తండ్రి మరణాన్ని మరిచిపోని గోపీ.. పెద్దయ్యాక తాను కూడా తండ్రి లాగే ‘త్రినేత్ర’లో చేరాలనుకుంటాడు. అందుకోసం చాలా ప్రయత్నాలే చేస్తాడు. చివరికి త్రినేత్రలో పని చేసే అవకాశం అతడికి వస్తుంది. అందులో శిక్షణ పొంది ఇక తన మిషన్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతాడు గోపి. కానీ సరిగ్గా అప్పుడే అనూహ్య పరిణామాలు జరుగుతాయి. గోపీ చిక్కుల్లో పడతాడు. అతడిపై దేశ ద్రోహిగా ముద్ర పడుతుంది. ఈ పరిస్థితుల్లో గోపీ ఏం చేశాడు.. ఆ చిక్కుల నుంచి బయటపడి.. తనను ఇరికించిన వాళ్ల పని ఎలా పట్టాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘క్షణం’ సినిమాతో మామూలు షాకివ్వలేదు అడివి శేష్. అతడిలో ఇంత టాలెంట్ ఉందా అనిపించాడు. రచయితగా.. నటుడిగా తనదైన ముద్ర వేసిన శేష్ ఇంకో సినిమా చేయడానికి చాలా సమయమే తీసుకున్నాడు. మళ్లీ అతనే కథ అందిస్తూ.. స్క్రీన్ ప్లేలో.. మేకింగ్ లోనూ కీలక పాత్ర పోషిస్తూ తీసిన ‘గూఢచారి’ చాలా కాలమే షూటింగ్ జరుపుకుంది. చివరగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ సినిమా తీయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందో సినిమా చూస్తున్నంతసేపూ అర్థమవుతూనే ఉంటుంది. ఎన్నో మలుపులు.. మరెన్నో సర్ప్రైజులు.. అనేక లేయర్లున్న కథ.. దానికి తోడైన ఆసక్తికర కథనం.. ప్రతి సన్నివేశంలోనూ ఎంతో డీటైలింగ్.. ప్రతి పాత్రలోనూ ఏదో ఒక ప్రత్యేకత.. కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్లు.. ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు.. ఇలా ‘గూఢచారి’లో చెప్పుకోవడానికి చాలా విశేషాలే ఉన్నాయి. ఇందులో హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి చాలానే ఉండొచ్చు గాక.. కానీ తెలుగు తెరపై ఇలాంటి సినిమా మాత్రం అరుదనడంలో సందేహం లేదు.
‘గూఢచారి’లో అన్ని అంశాలూ అందరినీ ఆకట్టుకుంటాయా.. ఇది అన్ని వర్గాలకూ రుచిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. ఇందులో వృథా అనిపించే అంశాలు కానీ.. సన్నివేశాలు కానీ ఏమీ కనిపించవు. ఈ సినిమాలో అతి పెద్ద విశేషం అదే. తొలి షాట్ దగ్గర్నుంచి ఎండ్ టైటిల్ పడే ముందు వరకు కథతో ముడిపడే సాగుతుంది. తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అయిపోయేలా సినిమా సాగుతుంది. ఈ కథకు దేశం కోసం రహస్యంగా పని చేసే నిఘా విభాగాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. ఐతే ఒక గదిలో కూర్చుని ఊహించి.. ఎక్కడో చదివిన విషయాల ఆధారంగా ఈ కథ.. ఇందులోని పాత్రలు రాసేయలేదు అడవి శేష్ అండ్ కో. ఆ విభాగం గురించి వాళ్లు పరిశోధించి తెలుసుకున్న విషయాల్ని తెరమీద చూపించిన విధానమే సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. నిజంగా మనం ఆ విభాగంలో శిక్షణ పొందే వాళ్లను నేరుగా చూస్తున్నామా అనిపించేట్లుగా ఆ ఎపిసోడ్లను తీర్చిదిద్దారు.
ప్రథమార్ధమంతా హీరో సీక్రెట్ ఏజెంట్ గా శిక్షణ పొందే నేపథ్యంలోనే కథ నడుస్తుంది. మొదట్లో కొంచెం నెమ్మదిగా కథ మొదలైనప్పటికీ.. ఒక దశ దాటాక ఆసక్తికరంగా సన్నివేశాలు సాగుతాయి. విరామం ముంగిట వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇక అక్కడ ినుంచి మరెన్నో మలుపులు.. సర్ప్రైజులతో కథ నడుస్తుంది. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పరుగులు పెట్టిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు శశికిరణ్. ద్వితీయార్ధంలో టెర్రరిస్టుల స్థావరాన్ని మట్టుబెట్టే ఎపిసోడ్ అయితే సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఇక చివర్లో వచ్చే అసలు ట్విస్టు ప్రేక్షకులకు పెద్ద షాకే ఇస్తుంది. కానీ ఆ సన్నివేశాల్ని మరింత ఎఫెక్టివ్ గా తీర్చిదిద్ది ఉండాల్సిందనిపిస్తుంది. క్లైమాక్స్ బాగానే పేలింది.
ఈ కథలో తండ్రి-కొడుకు మధ్య ఎమోషనల్ యాంగిల్ కూడా బాగానే ఉంది కానీ.. ‘క్షణం’లో తండ్రి-కూతురు మాదిరి అది టచ్ చేసేలా అయితే లేదు. సినిమాలో అన్ని పాత్రలూ బాగున్నాయి.. అందరూ ఆయా పాత్రలకు సూటయ్యారు కానీ.. చిత్రం బృందం సర్ప్రైజ్ లాగా దాచి పెట్టిన జగపతిబాబు పాత్ర మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు. ఆయన ఆ పాత్రకు సరిపోలేదనిపిస్తుంది. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. అంత తెలివైన.. అంత ట్రైన్ అయిన హీరో ఈజీగా ఉచ్చులో పడిపోయినట్లు చూపించడం వీక్ లింక్. ఇక ‘క్షణం’తో పోలిస్తే ‘గూఢచారి’ అన్ని వర్గాలకూ రీచ్ అవుతుందా అన్నది డౌట్. థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. కానీ మిగతా వాళ్ల సంగతే చూడాలి. హాలీవుడ్ సినిమాల పోలికలు కనిపించినప్పటికీ ‘గూఢచారి’ తెలుగులోనే కాక.. మొత్తం ఇండియన్ సినిమాలోనే వచ్చిన పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్లలో గా ‘గూఢచారి’ ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది.
నటీనుటులు:
అడివి శేష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మెప్పించాడు. హీరో కదా అని ఎక్కడా ఎలాంటి బిల్డప్ ఇవ్వకుండా సింపుల్ గా ఆ పాత్రకు తగ్గట్లు సటిల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. పాత్ర కోసం అతను సన్నద్ధమమైన తీరు.. ఎక్కడా అసహజంగా అనిపించకుండా నిజమైన సీక్రెట్ ఏజెంట్ ఇలాగే ఉండొచ్చేమో అనిపించేలా ఉన్న అతడి బాడీ లాంగ్వేజ్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. హీరోయిన్ శోభిత లుక్స్ ఏమంత గొప్పగా లేవు. కానీ ఆమె కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్ కూడా తన ప్రత్యేకత చాటుకున్నాడు. జగపతిబాబు కీలకమైన పాత్రలో సర్ప్రైజ్ చేశాడు. ఐతే ఆయన నటన మామూలుగానే అనిపిస్తుంది. టెర్రరిస్టు పాత్రకు ఆయన మిస్ ఫిట్ అనిపిస్తారు. అనీష్ కురువిల్లా.. సుప్రియ మెప్పించారు. వెన్నెల కిషోర్ లిమిటెడ్ రోల్ లోనే తనదైన పంచులతో నవ్వించాడు. మధుశాలిని ఓకే.
సాంకేతికవర్గం:
సాంకేతికంగా ‘గూఢచారి’ ఉన్నతంగా అనిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. సినిమాలోని తీవ్రత అంతా నేపథ్య సంగీతంలో కనిపిస్తుంది. షనీల్ డియో ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. సినిమాకు ఒక మూడ్ క్రియేట్ చేయడంలో సంగీత దర్శకుడు.. ఛాయాగ్రాహకుడు కీలక పాత్ర పోషించారు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పరిమిత బడ్జెట్లోనే సినిమాలో క్వాలిటీ చూపించారు. ఇక కథ కథనాల విషయంలో అడివి శేష్.. దర్శకుడు శశికిరణ్ తిక్కాల కృషి సినిమా అంతటా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. కథతో పాటు దాన్ని చెప్పిన విధానమూ కొత్తగా కనిపిస్తుంది. సంకల్పం ఉంటే పరిమిత బడ్జెట్లోనే అంతర్జాతీయ స్థాయి సినిమాలు చేయొచ్చనడానికి ‘గూఢచారి’ ఉదాహరణగా నిలబెట్టారు శేష్.. శశి. దర్శకుడిగా శశికిరణ్ ఆద్యంతం తన పట్టు చూపించాడు.
చివరగా: గూఢచారి.. ఎంగేజింగ్ స్పై థ్రిల్లర్
రేటింగ్-3/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre