అంతర్జాల దిగ్గజం.. గూగుల్ మంత్రం ఏంటి? నెటిజన్లను పోగేసుకునేందుకు, వారితో తన వ్యాపారాన్ని రాణింపజేసుకునేందుకు అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఎలా ముందుకు సాగుతోంది? ఇదీ.. అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఒకింత లోతుగా తరచిచూస్తే.. ఈ క్రమంలో గూగుల్ సంస్థ అనుసరిస్తున్న `పంథా` అవగతం అవుతుంది. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు.. `డూ ఆర్ డై` అనే మంత్రాన్ని ఎక్కువగా ప్రయోగిస్తారు. కానీ, గూగుల్ మాత్రం తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో.. పోటీదారులను ఎదిరించి నిలవడం ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే.. పోటీదారులను కొనేయడం అనే సూత్రాన్ని తూచ తప్పకుండా అవలింభిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
విషయం ఏంటంటే.. 2006లో గూగుల్.. యూట్యూబ్‌ను 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే.. దీనిని గమనించి న వారు.. యూట్యూబ్‌కుఅంత మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. కేవలం 65 మంది సిబ్బందితో నడిచే సంస్థ, అది కూడా ఏడాదిన్నర కాలంగడిచిన సంస్థను అంత మొత్తం ఇచ్చి ఎందుకు కొంటున్నారనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ, ఇప్పుడు అదే యూట్యూబ్ గూగుల్ కు ఆర్థిక పంచకళ్యాణిగా మారి.. అక్షయ పాత్రగా డబ్బుల మూటలు అందిస్తోంది. కేవలం మూడు వారాల ఆదాయం.. 1.65 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
అయితే.. గూగుల్ దూరదృష్టిపై ఆలోచన ఉన్నవారు మాత్రం దీనిపై ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. ఇది టెక్ చరిత్రలో అత్యుత్తమ కొనుగోలు(ఎంఅండ్ ఏ)గా పేర్కొంటున్నారు. ఖచ్చితంగా, అత్యుత్తమ వినియోగదారుల టెక్ సముపార్జనగా చెబుతున్నారు. 2005 లో గూగుల్ 50 మిలియన్ డాలర్ల ఆండ్రాయిడ్ కొనుగోలు చేసినప్పుడు, సిలికాన్ వ్యాలీ వెలుపల ఎవరికీ ఆండ్రాయిడ్ అంటే ఏమిటో తెలియదు. ఇది కాకుండా, గూగుల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పుడు YouTube ని స్నాప్ చేసింది. అంతేకాదు, డాట్-కామ్ క్రాష్ తరువాత టెక్ దిగ్గజం చేసిన మొట్టమొదటి వ్యూహాత్మక కొనుగోళ్లలో ఇది కీలకంగా నిలిచింది.
వాస్తవానికి గూగుల్ కూడా గతంలో వీడియో సైట్‌ను నడిపించింది. కానీ, యూట్యూబ్ కు ఉన్నంత క్రేజ్ కానీ, వీవర్స్ కానీ.. గూగుల్ వీడియోకు దక్కలేదు. దీంతో యూట్యూబ్‌తో గూగుల్ పోటీ పడలేక పోయింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ను కొనేసింది. ఇక్కడ మరో కోణం ఏంటంటే.. ఒకవేళ గూగుల్ యూట్యూబ్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే.. ఆన్‌లైన్ వీడియో ఎకోసిస్టమ్‌లో గూగుల్ వెనుకబడి పోయి ఉండేది. ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా కొనుగోలు చేయకపోయి ఉంటే.. ఇప్పుడున్న జోరు గూగుల్ దక్కి ఉండేది కాదనే విశ్లేషణలు వున్నాయి. అంతేకాదు.. వినియోగదారులను బ్రతిమాలుకునే పరిస్థితి ఏర్పడి ఉండేదని అంటారు.
2021 రెండవ త్రైమాసికంలో, YouTube అధిక వృద్ధిని సాధించింది. ఎందుకంటే ఈ కాలానికి ప్రకటన ఆదాయం రికార్డు స్థాయిలో 7.0 బిలియన్ డార్లకు చేరుకుంది. ప్రపంచంలోని అతి పెద్ద వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉన్న యూట్యూబ్ ప్రకటనల ఆదాయం 84% పెరిగి, 3.81 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కోవిడ్ కు ముందు.. యూట్యూబ్ ఆదాయం అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక, 2020 మూడో త్రైమాసికంలో యూట్యూబ్ ప్రకటనల ఆదాయం.. 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో అనూహ్యంగా గూగుల్ ప్రకటనల ఆదాయం 34 బిలియన్‌ల నుంచి 37.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఈ ఆదాయాన్ని గమనిస్తే.. గూగుల్ కంపెనీ.. యూట్యూబ్‌ను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం కంటే.. ఎక్కువగానే ఆర్జిస్తోందనే వాదన వినిపిస్తోంది. దాదాపు 14 ఏళ్లలో(యూట్యూబ్ కొనుగోలు చేసి) గూగుల్ ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. ఏటా యూట్యూబ్ ఆదాయం పెరుగుతూనే ఉంది. సో.. ఇది గూగుల్ చెల్లించిన దాని కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.