పాటలు మిక్కీ జే మేయర్ ఇచ్చినపుడు.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకెవరో ఎందుకిస్తారు.. అని సందేహం కలగొచ్చు. ఈ డౌట్ ఉన్నవాళ్లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వేసుకుని అందులో టైటిల్ కార్డ్స్ చూస్తే ‘నేపథ్య సంగీతం: మణిశర్మ’ అని పడటం గమనించవచ్చు. మిక్కీ మీద నమ్మకం లేకపోవడం వల్లో.. మణిశర్మ మీద గురి వల్లో తెలియదు కానీ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు మిక్కీతో పాటలు మాత్రం చేయించుకుని.. నేపథ్య సంగీతం బాధ్యత మాత్రం మణిశర్మకే అప్పగించారు. ఒకప్పటి ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో బాగా పట్టుంది. మంచి పేరుంది. గత ఏడాది ‘టెంపర్’ సినిమాకు పూరి సైతం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మణి సాయమే తీసుకున్నాడు.
‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సైతం మణిశర్మతోనే నేపథ్య సంగీతం చేయించాలని అనుకున్నారు. ఆయన్నే ఓకే చేశారు కూడా. కానీ ఏం జరిగిందో ఏమో చివరి నిమిషంలో మణిశర్మ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు హడావుడిగా మిక్కీ జే మేయర్ తో పాటు గోపీసుందర్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ పని చూస్తున్నారట. గోపీసుందర్ పీవీపీ వాళ్ల గత సినిమా ‘ఊపిరి’కి సంగీతాన్నందించాడు. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘బ్రహ్మోత్సవం’లోని ఓ కీలక ఎపిసోడ్ కు అతను నేపథ్య సంగీతం సమకూరుస్తుంటే.. మిగతా అంతా మిక్కీనే చూసుకుంటున్నాడు.
ఓవైపు డబ్బింగ్.. మరోవైపు రీరికార్డింగ్.. ఇంకోవైపు మిక్సింగ్.. ఇలా విడుదల తేదీని అందుకోవడానికి బాగానే శ్రమిస్తోంది ‘బ్రహ్మోత్సవం’ టీమ్. ఈ నెల 20న ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.