ఆగ‌స్టులో దూసుకొస్తున్న `ఆర‌డుగుల బుల్లెట్టు`

Update: 2021-07-04 08:30 GMT
క‌రోనా క్రైసిస్ నెమ్మ‌దిగా స‌ద్ధుమ‌ణుగుతోంది. గ‌త ఏడాది సీన్ మ‌రోసారి రిపీట‌వుతుందా?  వ‌రుస‌గా సినిమాలు రిలీజై బంప‌ర్ హిట్లు కొడ‌తాయా?  టాలీవుడ్ గొప్ప స‌క్సెస్ రేటుతో మ‌రోసారి ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుందా? ఇవ‌న్నీ ఇప్ప‌టికి జ‌వాబు లేని ప్ర‌శ్న‌లు. అయితే ఇంత‌కుముందు మొద‌టి వేవ్ ముగింపులో సాయి ధ‌రమ్ తేజ్ త‌న సినిమాని ఎంతో ధైర్యంగా రిలీజ్ చేసేందుకు డేర్ చేసిన‌ట్టే ఈసారి సెకండ్ వేవ్ అనంత‌రం గోపిచంద్ త‌న చిత్రాన్ని రిలీజ్ చేయించేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డం విశేషం.

గోపీచంద్ - న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన `ఆరడుగుల బుల్లెట్‌` ఆగ‌స్టులో రిలీజ్ కి రానుంది. జయబాలజీ రీల్‌ మీడియా పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు రిలీజ్ కి నిర్మాతలు స‌న్నాహ‌కాల్లో ఉన్నామ‌ని తెలిపారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత స్వ‌యంగా రిలీజ్‌ చేస్తున్నారు.

ప్రకాష్‌రాజ్- బ్రహ్మానందం- అభిమన్యు సిన్హా త‌దిత‌రులు ఇందులో న‌టించారు. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ క‌థ అందించ‌గా.. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించారు.  బాలమురగన్ సినిమాటోగ్ర‌ఫీ.. అబ్బూరి రవి డైలాగ్స్  ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నున్నాయి.

గోపిచంద్ న‌టించిన సీటీమార్ మ‌రోవైపు రిలీజ్ కావాల్సి ఉండ‌గా ఇంత‌లోనే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల‌ను ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సీటీమార్ క‌రోనా సెకండ్ వేవ్ కి ముందే రిలీజ్ తేదీని ప్ర‌క‌టించినా అనూహ్యంగా మ‌హ‌మ్మారీ ప్ర‌భావం పెర‌గ‌డంతో వాయిదా వేసారు.  గోపిచంద్ త‌దుప‌రి మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే చిత్రంలోనూ న‌టిస్తున్నారు. జీఏ 2 సంస్థ యువిక్రియేష‌న్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Tags:    

Similar News