ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా క్రేజీ మూవీ వస్తోంది అంటే అందులోనూ స్టార్ హీరోది అయితే పోటీగా ఇతర సినిమాలు రావడం అంత సేఫ్ ఫేమ్ అనిపించుకోదు. అందుకే సాహో-బాహుబలి లాంటి విజువల్ వండర్స్ వచ్చినప్పుడు మహేష్ బాబు అంతటి వాళ్లే రాజీ పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ గోపిచంద్ చాణక్య నిర్మాతలు మాత్రం రిస్క్ కు సై అంటున్నారు. దీని రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ అక్టోబర్ 5 అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.
అంటే సైరాకు దీనికి కేవలం మూడు రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుంది. రెండేళ్లుగా నిర్మాణంలో ఉంటూ మెగాస్టార్ 151వ సినిమాగా ఇప్పటికే విపరీతమైన అంచనాలతో వస్తున్న సైరా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందులోనూ నార్త్ లోనూ దీనికి మద్దతు దక్కడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని ఇప్పుడు చాణక్య కంటెంట్ లో ఎంత విషయం ఉన్నా ఇంత తక్కువ వ్యవధిలో సైరాతో పోటీ దిగడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు సుదీర్ఘంగా ఇచ్చిన నేపధ్యంలో సైరా కాకుండా మరో సినిమాకు స్పేస్ ఉంటుందన్న ఆలోచనతోనే చాణక్య నిర్మాతలు ధైర్యం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఇదేదో మంచి స్పై థ్రిల్లర్ అన్న ఇంప్రెషన్ కలిగింది. తిరు దర్శకత్వంలో రూపొందిన చాణక్య బడ్జెట్ పరంగానూ భారీగా రూపొందింది. గత కొంత కాలంగా తన స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న గోపీచంద్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం