స్టార్ హీరోల సినిమాలకు అభిమానులే దర్శకులైతే.. ఆ స్టార్ హీరోని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించాలని ప్రయత్నిస్తారు. సంక్రాంతికి రాబోతున్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను కూడా ఆ స్టార్స్ అభిమానులు డైరెక్ట్ చేయడం విశేషం. వీర సింహా రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ ఇద్దరు ఆ సినిమా హీరోలకు వీరాభిమానులు. తమ హీరోలని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయో బాగా లెక్కలు తెలిసిన దర్శకులు వీళ్లు.
ఆ లెక్కలతోనే బాలయ్యతో వీర సింహా రెడ్డి చేశాడు గోపీచంద్ మలినేని.. ఆ సమీకరాణలతోనే వాల్తేరు వీరయ్య చేశాడు బాబీ. అభిమానులే దర్శకులై ఈ రెండు సినిమాలు తీశారు. మెగా ఫ్యాన్స్ కోరుకునే అసలు సిసలైన మెగా మాస్ మూవీగా వాల్తేరు వీరయ్యని తీర్చిదిద్దాడు డైరెక్టర్ బాబీ. ఇక వీర సింహా రెడ్డిగా బాలయ్య ఉగ్ర రూపాన్ని అభిమాన దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు.
ఆ సినిమాలు చేస్తున్న టైం లో వీరిలో యాక్షన్ చెప్పినప్పుడు డైరెక్టర్ పాత్రలో ఉన్నా బయటకు వచ్చాక మాత్రం ఒక ఫ్యాన్ గా అవుట్ పుట్ చూసుకున్నారు. అందుకే ఈ రెండు సినిమాల మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అలాంటి సంక్రాంతికి ఈసారి చిరు, బాలయ్య ఇద్దరు పోటీ పడుతున్నారు. ఈ పోటీ కేవలం ఇద్దరి హీరోలదే కాదు వారి అభిమానించే ఇద్దరు దర్శకులది కూడా.
గోపీచంద్ వీర సింహా రెడ్డి మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో.. బాబీ కూడా వాల్తేరు వీరయ్య పక్కా హిట్ అనేస్తున్నాడు. మరి ఈ ఇద్దరు అభిమానుల్లో ఎవరు దర్శకులుగా సక్సెస్ అయ్యారు. ఎవరి తమ అభిమాన హీరోకి హిట్ సినిమా అందించారు అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. అభిమానులే దర్శకులై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఫ్యాన్స్ వారిని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపిస్తారు. మరి ఈ లెక్కన ఏ అభిమాని దర్శకుడిగా సక్సెస్ అయ్యాడో ఈ రెండు రోజుల్లో తెలుస్తుంది.