ఇంతకీ కత్తి సినిమా రీమేక్ అవుతోందా లేదా? నిన్నటి నుండి ఈ సినిమాను ఎన్టీఆర్ రీమేక్ చేస్తునానడంటూ ఒకటే వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజముందా అంటే కేవలం 50-50 అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇకపోతే ఈ సినిమాను గోపిచంద్ మలినేని రూపొందిస్తాడని కూడా వార్తలు వచ్చాయ్. అయితే కత్తి సినిమా డబ్బింగ్ వర్షెన్ కూడా రెడీ అయ్యక ఇప్పుడు దానిని రీమేక్ చేస్తారో లేదో తెలియదు కాని, గోపిచంద్ మాత్రం ఈ ప్రాజెక్టుతో అసలు సంబంధం లేదన్నట్లే కలరింగ్ ఇస్తున్నాడు.
''నా తదుపరి ప్రాజెక్టు ఏంటనేది నిర్మాత దిల్ రాజుగారు చెబుతారు. ప్రస్తుతం స్ర్కిప్టు వర్కు జరుగుతోంది. దయచేసి అప్పటి వరకు ఆగండి'' మనోడు ఒక ట్వీటేశాడు. అంటే మనోడికి కత్తి రీమేక్ తో సంబంధం లేనట్లేనా? ఇదే విషయంపై కొందరు జర్నలిస్టులు కాల్ చేస్తే, అసలు కత్తి సినిమాను తాను డైరక్టు చేయాలని ఒక్కసారి కూడా అనుకోలేదంటూ సెలవిచ్చాడు గోపిచంద్. సో, కత్తికీ గోపీచంద్ కు లింక్ లేదు మరి. ఇకపోతే ఇదే విషయంపై ఎన్టీఆర్ తో సినిమాను తీస్తున్న కొందరు కూడా ఖండించారు. కత్తి సినిమా టాక్ ఎందుకొచ్చిందో తెలియదు అనేశారు. అలాగే ఎన్టీఆర్ లండన్ లో గత నెల రోజులుగా గడుపుతుంటే అసలు కత్తి సినిమాను ఇప్పుడు ఓకే చేయడం ఏంటి అని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. ఏంటో ఈ కత్తి గోల!!!