అలా అనేశావేంటి గోపీచందూ..

Update: 2015-12-20 13:30 GMT
కొంచెం డిఫరెంటుగా ట్రై చేసిన సినిమాలు ఒకటి రెండు ఫెయిలై ఉండొచ్చు. అంత మాత్రాన ఇక భిన్నమైన సినిమాలే చేయనని తీర్మానించుకున కూర్చునేస్తే ఎలా? గోపీచంద్ ఇలాగే మాట్లాడుతున్నాడిప్పుడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక్కడున్నాడు, సాహసం తరహా భిన్నమైన సినిమాలు చేశాడు గోపీ. కానీ అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. గోపీ కొంచెం కొత్తగా ట్రై చేసిన మరికొన్ని సినిమాలు కూడా నిరాశ పరచగా.. రొటీన్ కథతో చేసిన ‘లౌక్యం’ పెద్ద హిట్టయింది. దీంతో ‘సౌఖ్యం’ సినిమాను కూడా రొటీన్‌ గానే ట్రై చేసినట్లున్నాడు గోపీచంద్. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ప్రేక్షకులు ప్రయోగాల్ని ఆదరించరని తేల్చేశాడతను.

‘‘ప్రేక్షకులు ప్రయోగాత్మక చిత్రాలు చూడ్డానికి థియేటర్లకు రారు’’ అని తీర్మానించేశాడు గోపీచంద్. నిర్మాతలు సినిమా మీద ఎంతో డబ్బులు పెడతారని.. ఆ డబ్బులు వెనక్కి రావాలన్నపుడు ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు గోపీచంద్. ఐతే రొటీన్ కథలు చేసినంత మాత్రాన నిర్మాతల డబ్బులకు గ్యారెంటీ ఉందా అన్నది కూడా ఆలోచించాలి మన హీరో గారు. ప్రయోగాత్మక చిత్రాలు అద్భుతమైన ఫలితాలు రాబట్టలేదా? గత ఏడాది ‘లౌక్యం’ ఎంత పెద్ద హిట్టయిందో.. దాని తర్వాత కొన్ని రోజులకే వచ్చిన ‘కార్తికేయ’ కూడా అంతకు మించి విజయం సాధించింది. అది ప్రయోగాత్మక చిత్రమే. చాలా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కింది. కానీ పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్లు వసూలు చేసింది. ఎంత తాను చేసిన ప్రయోగాత్మక చిత్రాలు ఫ్లాపై.. ఒక రొటీన్ సినిమా హిట్టయినా ఇలా ప్రయోగాలే చేయకూడదని భీష్మించుకుని కూర్చుంటే కష్టం కదా.
Tags:    

Similar News