గోపిచంద్‌ మళ్ళీ తప్పే చేస్తున్నాడు

Update: 2016-06-12 05:13 GMT
సపోజ్‌ ఒక హీరో వసూలు చేయగలిగే బడ్జెట్‌ రేంజ్ ఒక 20 కోట్లు ఉందనుకుందాం.. అప్పుడు సేఫ్‌ గేమ్ ఆడాలంటే ఆ హీరో కేవలం 15 కోట్లు సినిమా పూర్తి చేయాలి. అప్పుడే 5 కోట్లు సేఫ్‌ లో ఉంటాడు నిర్మాత. లేదంటే 20 కోట్లతో చేస్తే మాత్రం, సినిమా ఆడితేనే రికవరి ఉంటుంది. అదే ఒక 30 కోట్లతో చేస్తే? అప్పుడు మాత్రం హిట్టయినా కూడా చుక్కలు లెక్క పెట్టుకోవాల్సిందే.

గతంలో రొటీన్‌ కంటెంట్‌ సినిమాలను ఒప్పుకుని తప్పులు చేసిన యాక్షన్‌ హీరో గోపిచంద్.. ఇప్పుడు మళ్ళీ అలాంటి మిస్టేక్ నే చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో గోపి కొట్టిన హిట్టంటే ''లౌక్యం'' ఒక్కటే. ఆ సినిమా ఫైనల్ రన్‌ లో 21.55 కోట్ల షేర్‌ వసూలు చేసింది. అంటే ఒక హిట్టు కొడితే గోపి మార్కెట్ అదే. అలాంటప్పుడు ఈసారి కూడా ఒక 20 లోపు బడ్జెట్ తో సినిమా చేయాలిగాని.. మనోడు ''ఆక్సిజన్'' కోసం ఏకంగా 30 కోట్లతో ప్లానింగ్‌ చేశారు. దాదాపు షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా కోసం.. దర్శకుడు ఏ.ఎమ్.జ్యోతికృష్ణ అంత ఖర్చు పెట్టాడంటే షాకింగే మరి. ఇప్పుడు రిలీజ్‌ చేయలంటే ఈ ఖర్చంతా ఒక 32 వరకు వస్తుంది. అంతేసి రికవర్‌ చేయాలంటే మరి కుదురుతుందా?

పోనివ్ శాటిలైట్ రేటు ఒక 5 కోట్లు వచ్చినా.. సినిమాను 25 కోట్లకు పంపిణీదారులకు ఇవ్వాలి. అవి రికవర్‌ అవ్వాలంటే వాళ్ళకు బ్లాక్ బస్టరే కావాలి. అలా జరగనిచో.. గోపి మళ్ళీ పెద్ద తప్పు చేసినవాడే అవుతాడు.
Tags:    

Similar News