సినిమా ఇండస్ట్రీలో మన మనుగడ హిట్ మీదే ఆధారపడి ఉంటుంది. వరుసగా మూడు హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన ఉదయ్ కిరణ్ లాంటి హీరో ఆ తరువాత ఫ్లాప్ లతో ఏకంగా మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ ప్రేక్షకుడిని రెండున్నర గంటలు కూర్చుండబెట్టడం అంటే మామూలు విషయం కాదు. అందుకే కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులు.. కొత్త కాన్సెప్ట్ లతో వచ్చిన వారే నిలదొక్కుకుంటున్నారు. లేదంటే ఇండస్ట్రీ నుంచి దూరం అవుతున్నారు..
కొత్తదనం.. సృజనాత్మకథ ఈ రెండింటి మీదనే సినిమా పరిశ్రమ నడుస్తోంది. తాజాగా ఓ దర్శకుడికి హీరో గట్టి హ్యాండ్ ఇచ్చాడు. దాదాపు సినిమా తీద్దామని అనుకున్నాడు. కానీ ఆయన గత చిత్రం ఫ్లాప్ కావడంతో ఇక ప్రయోగాలకు పోవద్దని దర్శకుడికి హ్యాండ్ ఇచ్చాడు. అదిప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.
‘ఏమైందీ ఈవేళ’ లాంటి చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సంపత్ నందికి ఆ తర్వాత రాంచరణ్ తో తీసిన ‘రచ్చ’ మూవీ బ్రేక్ ఇచ్చింది. ఇతగాడి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో పనిచేసే అవకాశం లభించింది. కానీ ఏమైందో కానీ ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి సంపత్ నంది అర్ధాంతరంగా వైదొలిగాడు. అయితే మనోధైర్యం కోల్పోకుండా ఆ తర్వాత రెండు సినిమాలు తీశాడు. రవితేజతో ‘బెంగాల్ టైగర్’.. గోపీచంద్ తో తీసిన ‘గౌతమ్ నంద’ రెండు నిరాశనే మిగిల్చాయి. దీంతో ఇప్పుడు సంపత్ తో చేయడానికి ఏ హీరో - నిర్మాత ముందుకు రావడం లేదనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.
అయితే గౌతమ్ నందా మూవీ చేస్తున్నప్పుడే గోపీచంద్ మరో సినిమా చేస్తానని సంపత్ నందికి హామీ ప్రచారం జరిగింది.. కానీ ఇటీవల గోపీంచంద్ తీసిన ‘పంతం’ తేడా కొట్టాక అతడి ఆలోచనలో మార్పు వచ్చింది. సంపత్ నంది తయారు చేసిన మాస్ మసాల కథను తిరస్కరించాడనే రూమర్ బయటకు వచ్చింది.. అందుకే ఆ సినిమా నుంచి వైదొలిగాడట. కుమార్ సాయి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చేసి గోపీచంద్ సైడ్ అయిపోయాడు. ఇలా నమ్ముకున్న గోపీచంద్ హ్యాండ్ ఇవ్వడంతో సంపత్ నంది పరిస్థితి ఎటూ కాకుండా పోయింది.