అందాల‌ సారా టెండూల్క‌ర్ త‌గ్గేదేలే!

Update: 2022-11-11 10:30 GMT
కనుల‌ ముందర స్వర్గం నీవా? అందం అంటే అర్థం నీవా?.. అంటూ బోయ్స్ అదే ప‌నిగా ఆరాధిస్తున్నారు ఈ సొగ‌స‌రి భామ అందాన్ని. అందానికి అందం అద్భుత‌మైన ఆహార్యంతో మ‌తులు చెడ‌గొడుతున్న ఈ యంగ్ బ్యూటీ ఎవ‌రో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. క్రికెట్ గాడ్..  గ్రేట్ లెజెండ్ సచిన్ టెండూల్క‌ర్ కుమార్తె సారా టెండూల్క‌ర్ గురించే ఇదంతా. 24 ఏజ్ సారా ఇటీవ‌ల టాప్ మోడ‌ల్ గా రాణిస్తోంది. ఇన్ స్టాలో అసాధార‌ణంగా ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీతార‌ల‌తో క‌లిసి ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్ చేస్తున్న వీడియోలు వైర‌ల్ అయ్యాయి. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సారా టెండూల్క‌ర్ బాలీవుడ్ లో క‌థానాయిక‌గా కూడా ఆరంగేట్రం చేస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. క్రికెట్ గాడ్ కుమార్తె అందం గురించి క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్ తో స్నేహం గురించి కూడా ఇటీవ‌ల యువ‌త‌రంలో ర‌క‌ర‌కాలుగా గుస‌గుస‌లు వినిపించాయి. సారా తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న‌లో కనిపించింది.

ఈరోజు నా జుట్టుకు మళ్లీ ఎందుకు డార్క్ కలర్ వేసుకున్నానో నాకు క‌చ్చితంగా తెలియదు. కానీ నేను దానిని ప్రేమించడం ఆపేసాను. ఇదిగో నా కొత్త హైయియిర్ర్ర్!! అంటూ పాపుల‌ర్ హెయిర్ డైయింగ్ బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేసింది. ఈ వీడియోలో సారా ఎంతో క్యూట్ గా అందంగా క‌నిపిస్తోంది. ఒక బాలీవుడ్ స్టార్ కి ఏమాత్రం తీసిపోని ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టి ప‌డేసింది.

ఇక సారా వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే... త‌న‌కు పార్టీ క్రౌడ్ అంటే చాలా ఆస‌క్తి. సారా టెండూల్కర్ ఇటీవ‌లే అక‌డ‌మిక్ పరీక్షల‌ను ముగించిన‌ తర్వాత నైట్ పార్టీలో సంద‌డి చేసిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. సచిన్ టెండూల్కర్ కుమార్తె కాబ‌ట్టి సారా టెండూల్కర్ జీవితం ఎప్పుడూ ల‌క్ష‌లాది మంది వీక్ష‌ణ‌ల‌తో ట్రెండింగ్ లో నిలుస్తోంది. సారా త‌న‌ స్నేహితులతో క‌లిసి పార్టీలు చేసుకునే వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. సారా టెండూల్కర్ ఇప్పటికే తన ఫ్యాషన్ విన్యాసాలతో యువ‌త‌రం హృదయాలను గెలుచుకుంది. స్టార్ కిడ్ ఇంకా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వక‌పోయినా తరచుగా ఈవెంట్ లు ఫ్యాషన్ బ్రాండ్ల ప్ర‌మోష‌న్స్ లో భాగం అవుతోంది. అయితే సారా టెండూల్కర్ మెడికల్ గ్రాడ్యుయేట్ అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం లండన్ లో తదుపరి చదువులు కొనసాగిస్తోంది.

సచిన్ టెండూల్కర్ కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత 24 మే  1995 న డా.అంజలి టెండూల్కర్ ను వివాహం చేసుకున్నాడు. 12 అక్టోబరు 1997న వారి కుమార్తె సారా టెండూల్కర్ జ‌న‌నంతో ఈ జంట పేరెంట్ హుడ్ ను స్వీకరించారు. తర్వాత వారి కుమారుడు అర్జున్ టెండూల్కర్ 24 సెప్టెంబర్  1999న జన్మించాడు.

5 నవంబర్ 2022న సారా అక‌డెమిక్ పరీక్షలు ముగిశాయి. ఆ త‌ర్వాత‌ తన స్నేహితులతో కలిసి నైట్ పార్టీల్లో రిలాక్స్ అయ్యింది. సారా ఏ పార్టీలో క‌నిపించినా త‌నే స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలుస్తోంది. ఇంకా చెప్పాలంటే షో స్టాప‌ర్ గా అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకుంటోంది. 24 సెప్టెంబర్ 2022న సారా తన సోదరుడు అర్జున్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన IG కథనంలో సోద‌రుడితో క‌లిసి ఉన్న‌ అందమైన చిత్రాన్ని పోస్ట్ చేసింది. అది వారి చిన్ననాటి ఫోటో కావ‌డంతో అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది.

2022లో సారా తన మోడలింగ్ కెరీర్ పై దృష్టి సారించింది. ఏస్ డిజైనర్ అనితా డోంగ్రే బ్రైడల్ కలెక్షన్ తో ఇది ప్రారంభ‌మైంది. డిజైనర్ షెల్ఫ్‌ల నుండి అందమైన గులాబీ రంగు లెహంగాలో సారా గుర్తుపట్టలేనంత అందంగా రాకుమారిలా కనిపించింది. లెహంగాలో భారీ గోల్డెన్ థ్రెడ్ వర్క్ తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో సారా క‌నిపించింది. మునుముందు మోడ‌ల్ గా రాణిస్తూనే సినిమాల్లో న‌టించ‌నుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దీనిపై టెండూల్క‌ర్ కుటుంబం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News