'మైఖేల్' లో గౌత‌మ్ మీన‌న్ కీ రోల్?

Update: 2022-02-25 05:49 GMT
యంగ్ హీరో సందీప్ కిష‌న్ టాలీవుడ్ లో వెనుక‌బ‌డినా కోలీవుడ్ లో మాత్రం యాక్టివ్ గానే ఉన్నాడు. `గ‌ల్లి రౌడీ` త‌ర్వాత త‌మిళ్ సినిమాలతోనే బిజీ అయ్యాడు. `నార‌గ‌సూర‌న్`..`మైఖేల్` అనే రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. రెండు పెద్ద ప్రాజెక్ట్ లే. వాటిల్లో బిగ్ స్టార్స్ న‌టిస్తున్నారు.

అయితే   `నార‌గ‌సూర‌న్` మాత్రం ఆల‌స్య‌మ‌వుతుంది. వాయిదాకి కార‌ణాలు  ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌స్తుతం  `మైఖేల్` ప్రాజెక్ట్ మాత్రం వేగంగా ముందుకు క‌దులుతోంది. ఇది సందీప్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోంది.  సందీప్ కిషన్  హీరోగా న‌టిస్తున్నారు. విజయ్ సేతుప‌తి ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇది ప‌క్కా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఇప్ప‌టికే రిలీజ్  అయిన‌ ఫ‌స్ట్ లుక్  టైటిల్  పోస్ట‌ర్ తోనే యాక్ష‌న్ పీక్స్ అని హింట్ ఇచ్చేసారు. ఆ పోస్ట‌ర్ తోనే సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇందులో డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భం వెర్స‌టైల్ యాక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ కి  పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ  ఓ కొత్త బ్లా అండ్ వైట్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. భ‌విష్య‌త్ లోనూ ఇదే వేగంతో సినిమాలు చేయాల‌ని టీమ్ కోరుకుంది.

ఈలుక్ లో గౌత‌మ్ మీన‌న్ ఇన్వ‌స్టిగేష‌న్ ఆఫీస‌ర్ లా క‌నిపిస్తున్నారు. మ‌రి ఇందులో గౌత‌మ్ మీన‌న్ ఎలాంటి రోల్ పోషిస్తున్నారు? అన్న‌ది తెలియాలి. గౌత‌మ్ మీన‌న్  ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ల‌వ్ స్టోరీ...క్రైమ్  బ్యాక్ డ్రాప్  చిత్రాలు తెర‌కెక్కించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. యాక్టింగ్ అయినా ఆయ‌న‌కు అంతే ఫ్యాష‌న్. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాల్లో న‌టించ‌డంతో పాటు  నుంచి ఇత‌ర ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఎంతో  ఎంజాయ్ చేస్తారు.

ఆ కోవ‌లోనే సందీప్ కిష‌న్ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  అలాగే కొన్ని వెబ్ సిరీస్ ల‌లో కూడా గౌత‌మ్ మీన‌న్ న‌టించారు. ఇక గౌత‌మ్ మీన‌న్ డైరెక్ట‌ర్ గాను బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రో రెండు ప్రాజెక్ట్  ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

 ఇలా ద‌ర్శ‌కుడిగా ఇంత  బిజీగా ఉన్నా..న‌టుడిగానూ త‌న ఆస‌క్తిని చూపించుకుంటున్నారు. `మేఖేల్` చిత్రానికి రంజిత్ జ‌య‌కోడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భ‌ర‌త్ చౌద‌రి-పుష్క‌ర్ రామ్మోహ‌న‌రావు నిర్మిస్తున్నారు.

    
    
    

Tags:    

Similar News