సెంచరీ మూవీతో హాఫ్ సెంచరీ

Update: 2017-02-12 09:20 GMT
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిపై ముందు నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకు తగినట్లుగా సినిమా ప్రేక్షకులను అలరించింది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నట విశ్వరూపం చూసే అవకాశం దక్కడంతో.. అభిమానులు కలెక్షన్స్ వరద పారించేశారు.

అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇవ్వడం కూడా వసూళ్ల కౌంట్ బాగా పెరిగేందుకు కారణం అయింది. నైజాంలో 10.15 కోట్లు రాబట్టిన శాతకర్ణి.. సీడెడ్ లో 8 కోట్లు కొల్లగొట్టాడు. ఉత్తరాంధ్ర 5.2 కోట్లు.. గుంటూరు 4.2 కోట్లు.. కృష్ణా 3.15 కోట్లు.. తూర్పు గోదావరి 3.5 కోట్లు.. వెస్ట్ 3.5 కోట్లు.. నెల్లూరు 1.8 కోట్లు.. కర్నాటక 4.25 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 1 కోటి రూపాయల చొప్పున షేర్ వచ్చింది. అమెరికా కలెక్షన్స్ 7 కోట్లు.. మిగిలిన ఏరియాల్లో మరొక కోటి కలిపి.. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో 52.75 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ.  

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 47 కోట్లకు విక్రయించడంతో.. అన్ని ఏరియాల్లోని బయ్యర్లకు మంచి లాభాలు వచ్చాయి. ఓవర్సీస్ లో గతంలో మిలియన్ డాలర్ వసూలు చేసిన రికార్డ్ లేని బాలయ్య.. శాతకర్ణితో దాదాపు 2 మిలియన్ల మార్క్ కు చేరవకావడం విశేషం.
Tags:    

Similar News