అమ్మమ్మ కాబోతున్న స్టార్‌ హీరోయిన్‌ కు శుభాకాంక్షలు

Update: 2019-09-09 22:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ 21 ఏళ్ల వయసులోనే తన కజిన్‌ మృతి చెందడంతో ఆమె ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని అమ్మగా మారింది. 21 ఏళ్ల వయసులో 11 ఏళ్ల పూజా ఇంకా 8 ఏళ్ల ఛాయాలకు రవీనా టాండన్‌ అమ్మ అయ్యింది. అప్పటి నుండి కూడా ఆ ఇద్దరు అమ్మాయిలకు అమ్మగా మారి అన్ని చూసుకుంది. ఇద్దరు పెళ్లిలను చేయడంతో పాటు వారికి ఒక అమ్మగా ఏం చేయాలో అన్ని చేసింది. తాజాగా రవీనా రెండవ దత్త కూతురు ఛాయా సీమంతం జరిగింది. ఆ కార్యక్రమంను స్వయంగా తానే దగ్గరుండి మరీ అన్ని చూసుకుంది.

రవీనా టాండన్‌ అమ్మమ్మ కాబోతున్న విషయాన్ని ఆమె స్నేహితురాలు ఒకరు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం జరిగింది. అమ్మమ్మ కాబోతున్నందుకు శుభాకాంక్షలు. నిస్వార్ధమైన ప్రేమ నీది. ఎందరికో నీవు ఆదర్శంగా నిలిచావు. దత్త పుత్రిక సీమంతంను నీవు చాలా కష్టపడి శ్రద్ద పెట్టి చేశావు. నిన్ను చూసి గర్విస్తున్నాను అంటూ రవీనా గురించి పోస్ట్‌ చేసింది. రవీనా పెళ్లి చేసుకున్న సమయంలో తన ఇద్దరు దత్త కూతుర్లను తనతో అత్తవారింటికి తీసుకు వస్తాను అంటూ ముందే చెప్పిందట. అందుకు వారు ఒప్పుకోవడంతో ఆ పెళ్లికి ఓకే చెప్పిందట.

2004వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త అనీల్‌ తడాను వివాహం చేసుకున్న రవీనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాషా 14 ఏళ్లు ఇంకా రణ్‌ బీర్‌ కొడుకు 12 ఏళ్లు. తన సొంత ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా దత్తత తీసుకున్న ఆ ఇద్దరు పిల్లలను మాత్రం రవీనా ఎప్పుడు తక్కువ చేయలేదు. పెద్దమ్మాయి పూజాకు కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసింది. ఆమె ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటుంది. ఇప్పటికే పూజా తల్లి అవ్వడంతో రవీనా కొన్నాళ్ల క్రితమే అమ్మమ్మ అయ్యింది. ఇప్పుడు ఛాయా తల్లికాబోతుండటంతో మరోసారి అమ్మమ్మ అవ్వబోతుంది. ఛాయాతో తన అనుబంధం ఎక్కువ అని.. ఆమెకు పుట్టబోతున్న బిడ్డ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా రవీనా చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News