మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి` ఇంకెంత దూరంలో ఉంది? ఆగస్టులో వస్తుందా రాదా? దసరా రిలీజ్.. సంక్రాంతి రిలీజ్..!! అంటూ రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? అంటూ మెగాభిమానుల్లో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొంది. ఇబ్బడిముబ్బడి సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఈ కన్ఫ్యూజన్ మరింత ఇబ్బందికరంగానూ మారింది. అయితే ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
తాజా సమాచారం ప్రకారం.. సైరా చిత్రీకరణ ఇప్పటివరకూ 70 శాతమే పూర్తయ్యిందన్న ప్రచారంలో నిజం లేదు. ఇప్పటికే 99 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఒక శాతం సీన్లు ప్లస్ ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది. ఇక గ్రాఫిక్స్ పనులు మాత్రం భారీగా చేయాల్సి ఉందట. తాజా సమాచారం ప్రకారం మైలారం విలేజ్ సమీపంలో చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రీకరణ తర్వాత కోకాపేట పరిసరాల్లోని సెట్స్ లో చిత్రీకరణ చేయనున్నారు. తదుపరి వికారాబాద్ అడవుల్లో కొంత ప్యాచ్ వర్క్ ఉంటుందని తెలిసింది. ఈ సినిమాకి విజువల్ గ్రాఫిక్స్ వర్క్ భారీగా ఉంది. అందుకే ఆగస్టులో రిలీజ్ కుదరదని తాజాగా రివీలైంది. ఆగస్టు కుదరకపోయినా అక్టోబర్ నాటికి రిలీజ్ సాధ్యమేనని కొణిదెల కాంపౌండ్ భావిస్తోందట.
అక్టోబర్ లో దసరా సెలవుల కానుకగా ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేసేలా ప్లాన్ ని రీబూట్ చేశారని తెలుస్తోంది.2020 సంక్రాంతి వరకూ ఆగే ఆలోచన లేదని.. ఈ విషయంలో కొణిదెల కాంపౌండ్ సీరియస్ గా ఉందని మీడియాలో చర్చ సాగుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` జీవితకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార- తమన్నా-విజయ్ సేతుపతి- అమితాబ్ బచ్చన్- సుదీప్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2019 మోస్ట్ అవైటెడ్ జాబితాలో సైరా పేరు చేరింది కాబట్టి మెగాభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. 99శాతం టాకీ పూర్తయింది. కేవలం గ్రాఫిక్స్ తోనే డిలే .. కాస్త ఓపిగ్గా వేచి చూడాల్సిందే.