జీఎస్టీ వచ్చాక అనేక లెక్కలు మారిపోయాయి. వీటిలో సినిమా రంగం లెక్కలు కూడా ఉన్నాయి. అయితే.. అనేక మార్లు సినిమా జనాలు తమ సినిమా బిజినెస్ ను ముందగానే పూర్తి చేసేస్తూ ఉంటారు. కొందరు మాత్రం చివరి వరకూ ఆగితే.. అప్పుడు హైప్ ఎక్కువగా ఏర్పడి.. రేట్లు బాగా పలుకుతాయనే ఉద్దేశ్యంతో.. బిజినెస్ పూర్తి చేయకుండా ఆగుతారు.
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతుండగా.. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా రిలీజ్ కి దాదాపు 6 నెలల సమయం ఉన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ని గత నెలలోనే ఫినిష్ చేసేశారు. దాదాపు అన్ని ఏరియాల్లోనూ థియేట్రికల్ రైట్స్ విక్రయించేశారట. శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా ఒప్పందం జరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ బిజినెస్ జీఎస్టీ ఎఫెక్ట్ పడలేదని అంటున్నారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ విషయం లో మాత్రం మేకర్స్ చూపించిన అతి జాగ్రత్త.. కొంత డ్యామేజ్ కు కారణంమైందనే టాక్ వినిపిస్తోంది.
దసరాకే స్పైడర్ రిలీజ్ కానున్నా.. ఇంకా ఈ మూవీ బిజినెస్ డీల్స్ పూర్తి కాలేదు. మరికొన్ని రోజుల్లో వీటిని పూర్తి చేయనుండగా.. ఇప్పుడు పెరిగిపోయిన ట్యాక్సుల కారణంగా భారీ మొత్తాలను చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ సంకోచిస్తున్నారని తెలుస్తోంది. చాలా ఏరియాల నుంచి తక్కువ రేట్లకు కోట్స్ వస్తున్నాయట. పవర్ స్టార్ జీఎస్టీ దెబ్బను మిస్ అయితే.. సూపర్ స్టార్ మాత్రం దొరికేశాడన్న మాట.