జీఎస్టీ తొలి ఎఫెక్టు అల్లు అర్జున్ పైనే..

Update: 2017-06-14 10:59 GMT
చిన్న వ్యాపారి నుంచి బ‌డా బిజినెస్ మేన్ వ‌ర‌కు ఇప్పుడు దేశ‌మంతా ఒక‌టే చ‌ర్చ‌.. అది జీఎస్టీ. జులై 1 నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తే ట్యాక్సులు పెరుగుతాయ‌ని, దాన్ని త‌ట్టుకోలేమంటూ ఈ కామ‌ర్స్ సంస్థ‌లైతే భారీ డిస్కౌంట్ల‌తో ల‌క్ష‌లాది వ‌స్తువుల‌ను విక్ర‌యించేస్తున్నాయి. ఇక దేశంలోని అన్ని ర‌కాల వ్యాపారులూ జీఎస్టీకి సిద్ధ‌మ‌వుతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌పైనా జీఎస్టీ ఎఫెక్టు ప‌డ‌బోతుంద‌ట‌.

మ‌రి తెలుగు సినిమాల్లో జీఎస్టీకి దొరికే తొలి సినిమా ఏదో తెలుసా...? బ‌న్నీ బ్రాహ్మ‌ణ పాత్ర‌తో వ‌స్తున్న దువ్వాడ జ‌గ‌న్నాథం డీజే జీఎస్టీ ఎఫెక్టు చూడ‌నున్న తొలి తెలుగు సినిమా కానుంది.  ఈ విధానం 100 రూపాయల టికెట్లకు 28 శాతాన్ని ఫిక్స్ చేయగా అంతకంటే తక్కువ రేటు ఉన్న టికెట్ కు 18 శాతం ఖరారు చేసింది. దీంతో డీజే వచ్చే లాభాల్లో చాలా వరకు టాక్స్‌ ల‌కే పోనుంది.

ఈ టాక్స్‌ ల‌తో బయ్యర్లకు కొంత నష్టాన్ని చూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ నెల 23న రిలీజ్ అయ్యే డీజే సినిమాపై భారీ అంచనాలు ఉన్నా కూడా ట్యాక్సుల భ‌యం బ‌య్య‌ర్ల‌ను వెంటాడుతోంది. ఇప్పటికే టాక్స్ ల రూపంలో భారీ చిత్రాలకు పన్నులు విధిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణ‌యంతో టికెట్ల విషయంలో మరింత ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోనుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News