నేనైతే కట్టప్పగా చించేసేవాడ్ని!!

Update: 2017-07-01 18:15 GMT
బాలీవుడ్ విలన్ గుల్షన్ గ్రోవర్ ట్యాలెంట్ ఎలాంటిదో అందరికీ తెలుసు. హిందీ సినిమాల్లోనే కాదు.. అడపా దడపా తెలుగు సినిమాల్లో కూడా తన విలనిజం చూపించాడీయన. నాగార్జున మూవీ క్రిమినల్.. వెంకటేష్ మూవీ సుభాష్ చంద్ర బోస్ లతో పాటు పవన్ కళ్యాణ్ మూవీ బాలు చిత్రంలోనూ విలన్ గా కనిపించాడు గుల్షన్ గ్రోవర్.

ఇప్పుడు గుల్షన్ కన్ను ఏకంగా బాహుబలి మూవీలో కట్టప్ప పాత్రపై పడింది. సత్యరాజ్ పోషించిన కట్టప్ప రోల్ ను తానైతే ఇంకా బాగా నటించేవాడినని అంటున్నాడు. 'శారీరకంగా ఫిట్ గా ఉండడంతో పాటు ఎక్స్ ప్రెషన్స్ విషయంలోను  ఈ పాత్ర కోసం చాలా అవసరం. అవన్నీ నాలో ఉన్నాయి' అన్నాడు గుల్షన్ గ్రోవర్. అలాగని సత్యరాజ్ బాగా చేయలేదని కాదని.. తానైతే ఇంకా బాగా ఆ పాత్రను చేసి చూపించే వాడినన్నది గుల్షన్ గ్రోవర్ మాట.

అయితే.. కట్టప్ప పాత్రపై తను మనసు పడ్డ విషయాన్ని తనలోనే దాచుకోలేదు గుల్షన్ గ్రోవర్. ఇదే మాటను దర్శకధీరుడు రాజమౌళితో కూడా చెప్పాడట. తన ఆలోచనను పంచుకోవడమే కాదు.. రాజమౌళి చాలా ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని.. జక్కన్నతో పని చేసేందుకు తాను ఉత్సాహంగా ఉన్నానని అంటున్నాడు గుల్షన్ గ్రోవర్. మరి ఈ బాలీవుడ్ విలన్ కోరికను రాజమౌళి తీరుస్తాడో లేదో!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News