భళా గుణశేఖరా? అనుకున్నది సాధించావ్ .. పో! ఉన్నంతలో బెటర్ అనిపించావ్. పన్ను మినహాయింపులు, భారీ ఓపెనింగులు నీ ఊపిరి మిగిల్చాయి పో... !! కొట్టేశావ్ హిట్టు. పట్టేశావ్ గుప్తనిధి!! ఇది నిజంగానే చారిత్రాత్మకం. చరిత్రను తిరగరాశావ్ పో.. బాహుబలి లాంటి అసాధారణమైన విజువల్స్ ని చూసిన ప్రేక్షక జనం ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ రుద్రమను కూడా అంతే కసిగా చూశారు. అందుకే రిలీజైన తొలి మూడు రోజులు వసూళ్లు అదిరిపోయాయి.
సోమవారం నాటికి కాస్త ఊపు తగ్గినా ఇప్పటికే రుద్రమ బాగానే వసూలు చేసింది. మన చరిత్ర, తెలుగు రాణీ వీరత్వం అన్నీ వెండితెరపై చూసుకోవాలన్న కసి ఆడియన్సు అందరిలోనూ కనిపించింది. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే క్రిటిక్స్ సినిమా మీద విరుచుకుపడినా కూడా.. ఆడియన్సు మాత్రం సినిమాను చూసే తీరతాం అంటున్నారు. కాని రుద్రమదేవి బాహుబలి రేంజులో హిట్టవ్వదని అందరికీ తెలుసు. దానికి కారణం కేవలం గ్రాఫిక్సు ఒక్కటే కాదు. సినిమా ఎలా ఉందని టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీస్ థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. చరిత్ర మీద ఉన్న ఆసక్తిగా దానిని అభివర్ణించాలేమో. అయితే ఇదే కథను గుణశేఖర్ ఇంకా కరెక్టుగా చెప్పుంటే? ఇంకా అద్భుతంగా తీసుంటే?
అసలు రుద్రమ చరిత్రతలో కులాల ప్రస్థావన.. ఆమె కట్టించిన ఆసుపత్రిలో.. 80 ఏళ్ళ వయస్సులో ఆమె చేసిన యుద్దం.. ఆ తరువాత అంబదేవుడు అనే కడప రాజు ఆమెను మోసం చేసి వెనుక నుండి పొడిచేసిన వైనం.. ఇవన్నీ ఎక్కడ రాజా? ఒకవేళ చరిత్రను ఇంకా బాగా చూపించుంటే.. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుంటే.. ఓ 150 కోట్లు వసూలు వచ్చేదేమో. ఎవరూ అడగకుండా బ్రూస్ లీ బ్యాక్ స్టెప్ వేసేదేమో.. ఏమంటారు గుణ?