రాజమౌళి నేర్పిన లెసన్ పాటించుంటే...

Update: 2015-10-12 17:30 GMT
రుద్రమదేవి.. రిలీజ్ వరకూ కష్టాలు ఎదురైనా.. ఇప్పుడు చేస్తున్నది జైత్రయాత్రే. మూడు రోజుల్లో పాతిక కోట్లు.. అది కూడా ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి రావడం చాలా పెద్ద విషయం. అందులోనూ చారిత్రాత్మక చిత్రాలంటే డాక్యుమెంటరీలుగా ఉంటాయనే భావన ఉంది జనానికి. అయినా సరే ధైర్యం చేసి రుద్రమని తెరకెక్కించి,  ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాడు డైరెక్టర్ గుణశేఖర్.

కానీ ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో సాధించినదే. హిందీ వెర్షన్ కి వచ్చేసరికి రుద్రమ పరాక్రమం సరిపోలేదు. అక్కడొస్తున్న వసూళ్లు.. బాహుబలి కాదు కదా.. కనీసం ఓ లో బడ్జెట్ మూవీకి వస్తున్నట్లుగా కూడా లేవు. దీంతో రుద్రమదేవి అక్కడ డిజాస్టర్ గా తేల్చేశారు. సరైన ప్లానింగ్ ప్రచారం ఉండుంటే. ఈ మూవీని హిందీలో కూడా హిట్ చేసుకోవడం అసాధ్యమేం కాదు. కానీ ఇప్పుడు రుద్రమ పూర్తిగా డిజాస్టర్ అనిపించుకుంది. ప్రచారం విషయంలో వెనకబడ్డం పెద్ద లోటుగా చెప్పాలి. బాహుబలి ఇచ్చిన ఊపును కూడా ఉపయోగించుకోలేకపోవడం మేకర్స్ తప్పిదమే. అంత ఉత్సాహం ఎలాగూ అందుకోలేదు.. కనీసం పబ్లిసిటీ టెక్నిక్స్ ని కూడా ఫాలో అవకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం.. బాహుబలి పార్ట్ వన్ లో స్టోరీ తక్కువ కంటెంట్ ఎక్కువ. ఇక్కడ రుద్రమలో కంటెంట్ తో పాటు కదిలించే కథ ఉన్నా.. దాన్ని ప్రజల దగ్గరకు చేర్చే విధానంలో లోపాలే.. ఇప్పుడు హిందీ రుద్రమను పరాజయం పాలు చేశాయి. రాజమౌళి బాహుబలి విషయంలో పాటించిన సూత్రాలు బాలీవుడ్‌ లో అమలు పరచి.. అక్కడ ఇంటర్యూలు - ప్రెస్‌ మీట్లు - లోకల్‌ ఛానల్‌ కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే.. ఆ కిక్‌ ఇంకోలా ఉండేదేమో.
Tags:    

Similar News