వినూత్న ప్రచారం చేయబోతున్నారు

Update: 2015-08-15 04:23 GMT
కలెక్షన్స్ విషయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉంది. చరిత్ర ఎరుగని స్థాయిలో కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి పెద్ద సినిమాలు. ప్రపంచం నోరెళ్లబెట్టే స్థాయిలో బాహుబలి కుమ్మేస్తే... ఇండస్ట్రీ ఆశ్చర్యపోయే రేంజ్ లో వసూళ్లు సాధిస్తున్నాడు శ్రీమంతుడు. ఈ పాజిటివ్ ట్రెండ్ ని అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది రుద్రమదేవి టీం.

హిస్టారికల్ కాన్సెప్ట్ ని త్రీడీలో భారీగా చిత్రీకరించాడు గుణశేఖర్. సెప్టెంబర్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమా విజయానికి... భారీ ప్రచారాన్ని అందించబోతున్నారు. జనాల్లో ఆసక్తిని పెంచే పోస్టర్లు, పబ్లిసిటీ కాన్సెప్టులను ఇందుకోసం తయారు చేసుకున్నారు. ఇది చరిత్ర ఆధారంగా తీసిని మూవీ కావడంతో... విద్యాసంస్థల్లోనూ ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగితే సినిమా సగం హిట్టైనట్టే అని గతంలో చాలాసార్లే ప్రూవ్ అయింది. అందుకే ఇలాగన్న మాట.

అంతే కాదు.. అల్లు అర్జున్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజు, కృష్ణంరాజు వంటి నటులతోనూ ప్రచారం చేయబోతున్నారు. దాదాపు 70 కోట్ల రూపాయల హై బడ్జెట్ తో తీసిన సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవడంతోపాటు.. తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి రుచి చూపించాలని అనకుంటున్నాడు గుణశేఖర్. అందుకే ఇదంతా. రెండు మూడు రోజుల్లో రుద్రమదేవి ప్రచార హడావిడి మొదలుకానుందని తెలుస్తోంది.
Tags:    

Similar News