రుద్రమదేవికి సపోర్ట్ పెరుగుతోంది

Update: 2017-01-18 05:09 GMT
బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రం కావడంతో.. ఆ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పన్ను మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని.. రుద్రమదేవికి తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన విషయాన్ని కోట్ చేస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబుకు రుద్రమదేవి దర్శకనిర్మాత గుణశేఖర్.. ఒక లేఖ రాశాడు.

దక్షిణాపథాన్ని ఏలిన వీరనారి రుద్రమదేవి చరిత్రను తాను సినిమాగా తీశానని.. తన చిత్రానికి పన్ను మినహాయింపు కోరితే.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇప్పటికైనా అప్పుడు వసూలు చేసిన మొత్తం ఇప్పిస్తే.. ఊరట కలుగుతుందని.. ఆ లేఖ సారాంశం. అయితే.. ఏపీ సర్కార్ ఇంకా దీనిపై స్పందించలేదు. కానీ జనాల నుంచి మాత్రం గుణశేఖర్ కు మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే.. రుద్రమదేవికి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందే అంటూ #SupportRDforTaxExemptionInAP అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్వీట్స్ చేసేస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

కాకతీయ సామ్రాజ్య వనిత అయినా.. రుద్రమదేవి ఒక తెలుగు వీరనారి. అలాంటప్పుడు రెండు ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇవ్వడం సముచితం అనే చెప్పాలి. శాతకర్ణి విషయంలో పూర్తి కథ లేకుండా కొన్ని కల్పితాలతో చిత్రం తీశామని హీరో బాలకృష్ణ.. దర్శకుడు క్రిష్ చెప్పేశారు. వాస్తవ చరిత్రను రుద్రమదేవి చిత్రంగా ఆవిష్కరించిన గుణశేఖర్ కు పన్ను మినహాయింపు లభించడం సముచితం అన్నది జనాల అభిప్రాయం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News