ప్రశ్నించడం తప్పా? అంటున్న గుణశేఖర్

Update: 2017-11-15 14:00 GMT
2014 - 2015 - 2016 సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం.. అసలు చాలామందిని డిజప్పాయింట్ చేసింది. ఒక ప్రక్కన ఈ అవార్డులన్నీ బాలకృష్ణకు కట్టపెట్టారంటూ కొందరు.. అల్లు అర్జున్ ను కావాలనే తొక్కేశారంటూ కొందరూ.. అలాగే రుద్రమదేవికి అన్యాయం చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఇలా కామెంట్ చేస్తే మాత్రం మూడేళ్ళు బ్యాన్ చేస్తాం అంటూ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వమే వార్నింగ్ ఇస్తోందని ఇప్పుడు దర్శకుడు గుణశేఖర్ ఆరోపిస్తున్నాడు.

ఒక ట్వీట్ నోట్ రిలీజ్ చేసిన గుణశేఖర్.. అసలు రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వలేదు అని అడగటం తప్పా అంటూ సాక్షాత్తూ ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే ప్రశ్నించాడు. అసలు రుద్రమదేవి ఉత్తమ చిత్రంగా మూడు క్యాటగిరీల్లో ఎక్కడా నిలవకపోవడం.. అలాగే జ్యూరి గుర్తింపుకు కూడా నోచుకోకపోవడం.. ఏంటని ప్రశ్నించాడు. అంతేకాదు..ఎవడో ఒకడు చరిత్రను వెలికితీసి సినిమాను తీశాడు.. ఇప్పుడు వాడికి అవార్డ్ ఇచ్చి చరిత్రను గుర్తు చేయడం ఎందుకు అనుకున్నారా అంటూ సెటైర్ వేశాడు. చివరగా.. రుద్రమదేవి వంటి సినిమాను తీసినందుకు క్షమించండి అంటూ తన మనస్సులోని బాధను వ్యక్తపరిచాడు.

అంతే కాదు.. ఒకవేళ ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలకూ గాని ఇచ్చిన నందులపై కామెంట్స్ చేస్తే.. మరో మూడేళ్ళు బ్యాన్ చేస్తాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇదంతా చూస్తుంటే.. తెలుగు దేశం ప్రభుత్వం ఏ రేంజులో జనాలకు ఫ్రీడమ్ ఆఫ్‌ స్పీచ్ అనేది ఉందో చెప్పకనే చెబుతోంది. ఇచ్చింది తీసుకోండి.. రాకపోతే సైలెంట్ గా ఉండండి.. కాని ప్రశ్నించకండి.. అన్నట్లుంది ప్రభుత్వం తీరు అని కొందరు అంటున్నారు ..
Tags:    

Similar News