ప్రవీణ్ సత్తారు.. ఈ పేరు వింటే జనం గుర్తు పడతారో లేదో తెలీదు కానీ.. చందమామ కథలు చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు అంటే వెంటనే గుర్తు పట్టేసేవాళ్లున్నారు. మిగతా దర్శకులతో పోలిస్తే బాగా చదువుకున్నవాడు కాబట్టి ప్రవీణ్ కాస్త మంచిని సినిమాల్లో చూపించాలనుకున్నాడు. కానీ అది కమర్షియల్ ఫార్ములాటిక్ ప్రపంచంలో అస్సలు వర్కవుటవ్వనేలేదు.
అందుకే ఈసారి మారిన మనిషిలా 'గుంటూర్ టాకీస్' అనే చిత్రాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లో సరికొత్తగా ఆవిష్కరించాలని తపిస్తున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో గుంటూర్ టాకీస్ టైటిల్ కింద మస్తుగుందిరా అనే ట్యాగ్‌లైన్ రాశారు. గోడ పోస్టర్ అతికించే చోటు ఎలా ఉంటుందో ఈ పోస్టర్‌లో చూపించాడు. అయితే ఇది చూడగానే బోలెడన్ని డౌట్లు క్రియేట్ అయ్యాయి.
పోస్టర్‌పై ఎడమవైపు శివుడి పటం, కుడివైపు నర్తనశాల సావిత్రి పోస్టోర్ వేశారు. దిగువన రెండు క్యారేజీలు తగిలించిన సైకిళ్లను చూపించాడు. దీనర్థం ఏమిటో కాస్త కన్ఫ్యూజన్‌గానే ఉంది. గోడ పోస్టర్ వేసేవాడు మైదా పట్టుకుని పోస్టర్ల కట్టతో సైకిల్‌పై గోడ గోడ సంచరిస్తుంటాడు. గోడ ముందు సైకిల్‌ని పార్క్ చేస్తాడు. పోస్టర్ల సంచి దించుతాడు. ఇదంతా బాగానే సింబాలిక్‌గా ఉంది. కాని పక్కనే నర్తనశాల ఎందుకు? ప్రవీణ్ దీనికి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.