రష్మీ గౌతమ్ - శ్రద్ధా దాస్ - సిద్ధూలు నటించిన గుంటూరు టాకీస్ సినిమాకి వస్తున్న కలెక్షన్స్.. టాలీవుడ్ పండితులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సినిమాలో పస లేదని, కంటెంట్ ఏ మాత్రం లేదని, ట్యాలెంటెడ్ డైరెక్టర్ తీయదగ్గ సినిమా కాదని... ఇలా ఎన్ని రకాల విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ ని మాత్రం గుంటూరు టాకీస్ షేక్ చేసేస్తోంది.
ఈ సినిమాకి ముందు దర్శకుడు ప్రవీణ్ సత్తారు 3 సినిమాలు తీశాడు. నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకున్నాడు. గుర్తింపు, పేరు అయితే వచ్చాయి కానీ ఒకటి కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. దీంతో రూట్ మార్చేసి, ఫుల్ లెంగ్త్ అడల్ట్ మూవీ రేంజ్ లో సినిమా తీసేశాడు. ఈ మూవీకి పస్ట్ అండ్ బెస్ట్ అట్రాక్షన్ రష్మీ గౌతమ్ అందాలే. ఇదే సెల్లింగ్ పాయింట్. మార్కెట్ లో ఇది బాగానే క్లిక్ అయింది. డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ప్రస్తుతం క్రేజ్ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తున్న మారుతీ కూడా డబుల్ మీనింగ్ - బూతు సినిమాలతోనే పేరు సంపాదించాడు. తర్వాత తన ట్యాలెంట్ చూపిస్తూ రూట్ మార్చాడు.
మారుతీ తర్వాత చాలా మంది ఈ జోనర్ లో ట్రై చేశారు కానీ క్లిక్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో బూతుకు గిరాకీ తగ్గిపోయిందని అంతా అన్నారు. ఇప్పుడలాంటి కామెంట్స్ అన్నీ వేస్ట్ అని, బూతు కంటెంట్ కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుందని.. గుంటూరు టాకీస్ ప్రూవ్ చేసింది. అటు ప్రవీణ్ సత్తారుకి - ఇటు రష్మీకి కలలు తీర్చిన ప్రాజెక్ట్ అయింది.