బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ కి వెండితెరపై వెలగాలని చాలా కాలం నుంచే ట్రై చేస్తోంది. అసలు అమ్మడి రూట్ అదే. సిల్వర్ స్క్రీన్ నుంచే ఇటు వచ్చింది కూడా. అక్కడ చిన్నా చితకా పాత్రలతో గుర్తింపు రాక.. టీవీలో సత్తా చాటుతోంది. అయితే సినిమాల్లో వెలిగిపోవాలన్న కోరికను కంటిన్యూ చేస్తూ మూవీస్ చేస్తూనే ఉంది. గుంటూరు టాకీస్ పేరుతో ఓ సినిమా చేసింది రష్మీ. చందమామ కథలు లాంటి ఫీల్ ఉన్న మూవీస్ తీసిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం కావడంతో బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.
దాదాపుగా గుంటూరు టాకీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఆరునెలలు అవుతున్నా.. మళ్లీ వినిపించకపోవడంతో.. ఇది రిలీజ్ కాదనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు సడెన్ గా టీజర్ గా ముందుకొచ్చింది యూనిట్. కేరక్టర్లను బాగానే పరిచయం చేశారు. ఈ మూవీని విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీని బేస్ చేసుకుని రూపొందించారు. టూ ఈడియట్స్ అంటూ నరేష్ ని, సిద్ధూని ఇంట్రడ్యూస్ చేసి.. హీరోయిన్స్ అయిన రష్మీ, శ్రద్ధాదాస్ లతో పుట్టించేందుకు ట్రై చేశాడు డైరెక్టర్.
లెక్కపెట్టలేనన్ని అఫైర్స్ అంటూ.. హీరో కేరక్టర్ తో రొమాన్స్ చేస్తున్న ఈ భామల సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కామెడీ కనుక క్లిక్ అయితే.. రష్మీ హిట్ కొట్టేట్టే అనిపిస్తోంది. అప్పట్లో పాలు లేవూ.. పాల్లేవ్.. అంటూ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే.. గుంటూరు టాకీస్ హిట్ అవాల్సిందే.
Full View