వెంకీ ముందుకు.. వర్మ వెనక్కి

Update: 2017-03-22 07:47 GMT
ఏప్రిల్ 7న తెలుగు సినిమా ‘గురు’... తమిళ డబ్బింగ్ మూవీ ‘చెలియా’.. హిందీ మూవీ ‘సర్కార్-3’ విడుదల కావాల్సింది. కానీ ఆ రోజుకు వీటిలో ఒక్క సినిమా మాత్రమే యథాతథంగా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా రెండు సినిమాల రిలీజ్ డేట్లు మారిపోనున్నట్లు సమాచారం. 7న అనుకున్న వెంకీ మూవీ ‘గురు’ను వారం ముందే రిలీజ్ చేసే యోచనలో ఉన్నాడట నిర్మాత శశికాంత్.

‘చెలియా’ మీద మంచి బజ్ ఉన్న నేపథ్యంలో దాంతో పోటీ పడి కలెక్షన్లు పంచుకోవడం కంటే వారం ముందే.. ఉగాది వీకెండ్లో సినిమాను రిలీజ్ చేయడం బెటరని భావిస్తున్నారట. మార్చి 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు సీనియర్ పీఆర్వో బీఏ రాజు కూడా ధ్రువీకరించారు. ఆ రోజుకు నయనతార సినిమా ‘డోర’ వస్తున్నప్పటికీ దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. 29న అనుకుంటున్న ‘రోగ్’ సంగతే తేలాల్సి ఉంది. అది వచ్చినా కూడా వెంకీ మూవీ మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.

ఇక వర్మ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్ 7న విడుదల చేయాలనుకున్న ‘సర్కార్-3’ని మే 12కు వాయిదా వేసినట్లు క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇందుకు కారణాలేంటో ఆయన వెల్లడించలేదు. మార్చి 17కే అనుకున్న ‘సర్కార్-3’ని ఏప్రిల్ 7న వర్మ పుట్టిన రోజుకు రిలీజ్ చేయాలని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భావించింది. మరి ఆ తేదీకి సినిమాను ఎందుకు తీసుకురావట్లేదో తెలియట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News