జస్ట్ ఒక పదిహేను రోజుల క్రితం పరిస్థితి ఎలా ఉండేదంటే.. ఎన్టీఆర్ 'అరవింద సమేత' కు పోటీగా విజయ్ దేవరకొండ 'నోటా' ను రిలీజ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. అసలే 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ ఊపు.. యూత్ లో క్రేజ్ఉన్న విజయ్ దేవరకొండ 'నోటా' పై భారీ అంచనాలు ఉండేవన్న సంగతి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అసలే త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అజ్ఞాతవాసి' ఫలితంతో అందరినీ బెదరకొట్టి ఉండడంతో 'అరవింద సమేత' కు 'నోటా' తో డేంజర్ తప్పదన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియాలో హంగామా కూడా జరిగింది. కానీ విజయ్ ట్విట్టర్ ఖాతాలో ఆడియన్స్ పోల్ ద్వారా డేట్ ను అడగడం.. 'నోటా' టీమ్ కూడా అక్టోబర్ 5 కు మొగ్గు చూపడం తో అదే డేట్ ను ఫైనల్ చేశారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇక పోటీ అనే మాటే పక్కకెళ్ళింది. ఒకవేళ నిజంగా పోటీలో రిలీజ్ చేసి ఉంటే 'నోటా' పరిస్థితి ఏమయ్యుండేది?
'నోటా' కు భారీ దెబ్బ పడేది.. అంతే కాదు.. 'అరవింద సమేత' కు డ్యామేజ్ జరిగేదే. ఎందుకంటే.. సోలో రిలీజ్ కాబట్టి.. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అదే పోటీలో మరో సినిమా ఉంటే ఈ రేంజ్ ఓపెనింగ్ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం అయితే ఉండేది కాదు. అందుకే పెద్ద హీరోల సినిమాలు వీలైనంత వరకూ రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. ఇక సంక్రాంతి లాంటి సందర్భాల్లో పోటీ తప్పదు కాబట్టి దాన్ని మనం పట్టించుకోనవసరం లేదు. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ సినిమాతో పోటీ గురించి అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది నిజమే.. "పోటీకెళ్తే నష్టం తారక్ అన్నకు ఎందుకు ఉంటుంది? మాది చిన్న సినిమా కాబట్టి మేం కదా జాగ్రత్త పడాలి" అన్నాడు. మరి ఏ ఉద్దేశం తో అన్నాడో గానీ అది ఇప్పుడు నిజం అయింది.