తెలుగు హీరోకి వార్నింగ్ ఇచ్చిన‌ హ‌న్సిక‌!

Update: 2023-05-23 07:00 GMT
'మీటూ ఉద్య‌మం'లో భాగంగా లైంగికంగా బాధింప‌బ‌డ్డ‌ వారంతా! ఒక్కొక్క‌రుగా వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లో భాగంగా లైంగిక దోప‌డిపై ఎంతో మంది న‌టీమ‌ణులు విస్తుపోయే వాస్త‌వాలు బ‌య‌ట పెట్టారు. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ భాష‌తో సంబంధం లేకుండా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో నూ దొపిడికి గురైన వారంతా త‌మ బాధ‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసారు.

ఇలాంటి వారి భారి నుంచి త‌ప్పించు కున్న‌ట్లు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు త‌మ అనుభ‌వాలు రివీల్ చేసారు. తాజాగా ఆపిల్ బ్యూటీ హ‌న్సిక కు ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి చేదు అనుభ‌వాన్ని ఎదుర్కున్న‌ట్లు రివీల్ చేసింది. ఇంత‌కాలం పెద‌వి అంచున దాచేసిన మ‌నోవేద‌నని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. కెరీర్ ఆరంభంలో డిజైన‌ర్ల నుంచి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర్కుందో  తెలిపింది. ఆవేంటో ఆమె మాటల్లోనే..
 
'కెరీర్ ఆరంభంలో ఈ మోడల్‌లో నాకు బట్టలు కావాలి? తయారు చేసి ఇస్తారా? అని డిజైన‌ర్ల‌ను  అడిగితే నో చెప్పేవారు.అలా ఎందుకు చెబుతున్నారో?నాకు అర్ద‌మ‌య్యేది కాదు.

మ‌న‌సులో దురుద్దేశంతోనే అలా ప్ర‌వ‌ర్తిచేవార‌ని త‌ర్వాత కొంత కాలానికి అర్ధ‌మైంది. ఇప్పుడ‌దే డిజైన‌ర్లు నాతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ముందుకొస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికైనా ఇదొక ద‌శ అని అర్ధ‌మైంది.

అలాగే తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ హీరో ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేసేవాడు. డేట్ కి వ‌స్తావా? అని అడిగే వాడు. కానీ అత‌నికి త‌గిన రీతిలో బుద్ది చెప్పి పంపించాను' అని తెలిపింది. దీంతో హ‌న్సిక తో వార్నింగ్ అందుకున్న ఆ తెలుగు హీరో ఎవ‌రా? అని ఆరాలు మొద‌ల‌య్యాయి.

హ‌న్సిక బాల‌న‌టిగా తెరంగేట్రం చేసి  దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ కి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో కొత్త భామ‌ల పోటీని త‌ట్టుకుని హ‌న్సిక అవ‌కాశాలు అందుకోవ‌డంలో వెనుక‌బ‌డింది.

Similar News