సి. సుందర్ కోలీవుడ్ దర్శకుడే అయినా.. టాలీవుడ్ కి కూడా సుపరిచితుడే. ఈయన రూపొందించిన అనేక సినిమాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ నే సాధించాయి. అయితే.. ఈయన డైరెక్షన్ లో ప్రారంభం జరుపుకున్న సంఘమిత్ర మూవీ మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా వార్తల్లో నిలుస్తోంది.
బడ్జెట్.. కథ.. క్యాస్టింగ్ తో మొదట వార్తల్లో నిలిచిన సంఘమిత్ర.. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ప్రధాన పాత్రధారిణి అయిన శృతి హాసన్ తప్పుకోవడం సంచలనం అయింది. అయితే.. ఈ విషయంపై హీరోయిన్-నిర్మాతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా హుందాగా నిలవడం ఒక్కటే ఊరట కలిగించే విషయం. మరి సంఘమిత్ర పాత్రను ఎవరితో చేయిస్తారనే అంశంపై చాలానే ఆసక్తి ఉంది. రీసెంట్ గా ఈ రోల్ లో కనిపించేందుకు.. భారీ మొత్తం ఆఫర్ చేసి నయనతారను ఒప్పించారనే టాక్ వచ్చింది. కానీ.. ఇప్పుడా ఆఫర్ ను హన్సిక చేతిలో పెట్టారనే న్యూస్.. హాట్ టాపిక్ అయిపోతోంది.
జానపద చిత్రం.. 8వ శతాబ్దం నాటి కథలో యుద్ధనారిగా హన్సికను నటింపచేయనున్నారని.. ఆమెతో అరణ్మణై(కళావతి) సిరీస్ తీసిన దర్శకుడు సుందర్ సి.. ప్రత్యేకంగా ఆమెతో మాట్లాడి ఒప్పించాడని అంటున్నారు. మరీ ఈ ఆఫర్ కు హన్సిక రియాక్షన్ ఏంటనే విషయం ఇంకా తెలియలేదు కానీ.. ఆ రోల్ లో బొద్దుగుమ్మ హన్సికను ఊహించుకున్నవారు మాత్రం వామ్మో అనేస్తున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/