సామ్ వారియర్.. బన్నీ స్వీట్!

Update: 2023-05-19 08:00 GMT


దేశ ముదురు సినిమాతో యాపిల్ బ్యూటీ హన్సిక తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ హీరో కాగా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఆ సినిమాలో హన్సిక అందాలకు అందరూ ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి హన్సిక కెరిర్ కి  తిరుగులేదు. వరస గా అవకాశాలు చేజిక్కించుకుంది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించింది. ఇటీవల పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. కాగా, తాజాగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తనతో కలిసి నటించిన పలువురు నటుల గురించి ఆమె గొప్పగా మాట్లాడారు. తన ఫస్ట్ హీరో అల్లు అర్జున్ పై అయితే ప్రశంసల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ చాలా స్వీట్ పర్సన్ అని చెప్పింది. అతనితో  కలిసి పని చేసిన సందర్భాలను సైతం ఆమె ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ సినిమాలో అల్లు అర్జున్ తనకు ఎంతో సహకరించారని ఆమె చెప్పారు.

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై కూడా హన్సిస ప్రశంసల జల్లు కురిపించింది. సమంత ఓ వారియర్ అంది. సమంత చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా చెప్పింది. నిజానికి చాలా మంది హీరోయిన్లకు ఒకరంటే మరొకరికి పడదు అనుకుంటారు. కానీ వారి మధ్య ఎలాంటి ఇగోలు ఉండవని హన్సిక , సమంతపై చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వారు ఒకరిని మరొకరు గౌరవించుకుంటారు అని అర్థమౌతోంది.

ఇక దక్షిణాది నటులపై ఉత్తరాదివారు కొంచెం వివక్ష చూపిస్తారంటూ ఆమె బాంబు పేల్చారు.నార్త్ కి చెందిన కొందరు డిజైనర్లు, తమకు దుస్తులు డిజైన్ చేయడానికి కూడా ఆసక్తి చూపించరని ఆమె చెప్పడం గమనార్హం. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు గుర్తింపు వస్తున్నప్పటికీ, ఇంకా అందరినీ సమానంగా చూడటం లేదని ఆమె చెప్పడం విశేషం. అన్ని ప్రాంతాల నటులను సమానంగా చూడటం చాలా అవసరం అని ఆమె చెప్పారు.

ప్రస్తుతం హన్సిక ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. అల్లూ అర్జున్ ఫ్యాన్స్ మాత్రం హన్సిక కామెంట్స్ విని మురిసిపోతున్నారు.

Similar News