రికార్డ్‌ : హాఫ్‌ సెంచరీ చేసిన దేశముదురు బ్యూటీ

Update: 2020-11-02 08:30 GMT
ఒకప్పుడు హీరోయిన్స్‌ ఏడాదిలో నాలుగు అయిదు అంతకు మించి సినిమాల్లో నటించే వారు. 1980 హీరోయిన్స్‌ కొందరు వందల సినిమాల్లో నటించారు. కాని ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ ఈ రోజు ఉంటే రేపు ఉంటారో ఉండరో తెలియడం లేదు. వరుసగా రెండు మూడు ప్లాప్స్‌ పడితే వారిని పట్టించుకోవడం లేదు. వరుసగా సక్సెస్‌ లు వచ్చినా కూడా ఒకసారి నటించిన హీరోయిన్‌ తో మరోసారి నటించేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. అందుకే స్టార్‌ హీరోయిన్స్‌ కూడా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయలేక పోతున్నారు. ఇలాంటి సమయంలో ఒక హీరోయిన్‌ 50 సినిమాలు పూర్తి చేసుకోవడం అంటే చాలా పెద్ద విషయం.

సౌత్‌ సినీ ఇండస్ట్రీలో ఈతరం హీరోయిన్స్‌ లో అతి తక్కువ మంది హీరోయిన్స్‌ మాత్రమే హాఫ్‌ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నారు. కాజల్‌ తో పాటు ఒక్కరు ఇద్దరు మాత్రమే హాఫ్‌ సెంచరీ క్రాస్‌ చేశారు. మరో ఇద్దరు ముగ్గురు హాఫ్‌ సెంచరీకి దగ్గరగా ఉన్నారు. తాజాగా దేశముదురు ముద్దుగుమ్మ హన్సిక తన 50వ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసుకుంది. తెలుగులో హీరోయిన్‌ గా మొదటి సినిమా చేసిన హన్సిక తన 50వ సినిమాను తమిళంలో శింబుతో కలిసి చేసింది. మహా సినిమాతో హన్సిక ఈ మైలు రాయి చేరుకుంది.

ఇటీవల మహా సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా తన 50వ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లుగా చెప్పడంతో పాటు అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ గొప్ప జర్నీలో నాతో ప్రయాణించిన.. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అంది. తన 50వ సినిమాలో శింబు కీలక పాత్రలో నటించినందుకు శింబుకు కృతజ్ఞతలు చెప్పింది.
Tags:    

Similar News