బ్రేకప్‌ తర్వాత అండగా నిలిచిందే

Update: 2015-07-11 13:30 GMT
ప్రేమించటం.. విడిపోవటం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే.. ప్రేమించే సమయంలో చూపించే ప్రేమ.. అది బ్రేకప్‌ అయినప్పుడు మాత్రం మొత్తంగా మాయం కావటం మామూలే. కానీ.. అలాంటి వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ.. వార్తల్లోకి వచ్చింది పాలబుగ్గల బద్దుభామ హన్సిక.

వాలు చిత్ర షూటింగ్‌ సమయంలో తమిళనటుడు శింబుతో ప్రేమలో పడిన హన్సిక.. ఆ సినిమా షూటింగ్‌ అయ్యే సమయానికి బ్రేకప్‌ కావటం తెలిసిందే. మొత్తానికి ఒక సినిమా షూటింగ్‌ మొదలై.. పూర్తి అయ్యేసరికి లవ్‌.. బ్రేకప్‌ కావటం జరిగిపోయాయి. అయితే.. అనుకోకుండా ఈ సినిమాకు సంబంధించి వ్యవహారం కూడా చిక్కుల్లో పడింది. సినిమా షూటింగ్‌ పూర్తి కాకపోవటంతో తీవ్ర ఒత్తిడిని శింబు ఎదుర్కొంటున్నారు. ఇక.. ఆయన శింబు తండ్రి బాధ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.

తన కొడుకు శింబుపై కుట్ర జరుగుతుందని వాపోతున్నారు. అయితే.. వాలు సినిమాకు సంబందించి పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ పార్ట్‌ని కంప్లీట్‌ చేసేందుకు హాన్సిక ఒప్పుకోవటంతో పాటు.. శింబు తన సమస్యల్ని జయిస్తాడంటూ ఓపెన్‌గా చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లవ్‌ బ్రేక్‌ అయ్యాక కూడా మాజీ ప్రియుడి పట్ల హన్సిక చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తే.. ఆమె మనసు ఎంత మంచిదో అన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News