మన పాదం కదిలే లోపే నెగిటీవ్ వార్తలు ప్రపంచాన్ని చుట్టేసే రోజులివి. అయితే సినిమా ఇండస్ట్రీలో పాజిటివిటీ కంటే నెగిటివిటీ రాకెట్ స్పీడుతో స్ప్రెడ్ అవుతూ వుంటుందన్నది చాలా విషయాల్లో తేలిపోయింది. ఇక్కడ సక్సెస్ వున్న వారికే విలువ ఎక్కువ. సక్సెస్ పలకరించలేదో వారిపై లేని పోనివి ప్రచారం చేయడం ఇక్కడ కామన్. అలాంటి విచిత్రమైన అనుభవాన్నే దర్శకుడు హను రాఘవపూడి ఇండస్ట్రీ జనాల నుంచి ఎదుర్కొన్నాడట.
`అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన హను తొలి మూవీతోనే భావుకతతో అందమైన సినిమాలని తెరకెక్కించే దర్శకుడిగా ప్రశంసల్ని సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించక పోయినా తను ఎంచుకున్నకథ, దాన్ని తను వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుని దర్శకుడిగా హనుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మలి ప్రయత్నంగా నేచురల్ స్టార్ నానితో `కృష్ణగాడి వీర ప్రేమగాథ` చేస్తే ఈ మూవీ కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది ఎబౌ యావరేజ్ అనిపించుకుంది.
అయితే ఆ తరువాత నితిన్ తో చేసిన `లై`, శర్వానంద్ తో రూపొందించిన `పడి పడి లేచే మనసు` డిజాస్టర్ అనిపించుకుని దర్శకుడిగా హను రాఘవపూడికి షాకిచ్చాయి. ఈ రెండు సినిమాల లైన్ మంచిదే అయినా హను వీటిని నడిపించిన తీరు బెడిసికొట్టింది. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకోగా సెకండ్ హాఫ్ తేలిపోవడంతో ఈ రెండు సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి. దీంతో హను పై సెంకండాఫ్ సిండ్రోమ్ వున్న దర్శకుడిగా ముద్ర పడిపోయింది.
నెట్టింట కూడా ఇదే ప్రచారం జరిగింది. నెటిజన్ లో ఓ రేంజ్ లో ట్రోల్ చేయగా ఇండస్ట్రీ వర్గాలు కూడా హను రాఘవపూడిపై ఇదే తరహా ప్రచారం చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ హను రాఘవపూడి వెల్లడించాడు. రీసెంట్ గా `సీతారామం` వంటి ఎపిక్ లవ్ స్టోరీతో బ్లాక్బస్టర్ హిట్ ని దక్కించుకుని మళ్లీ వార్తల్లో నిలిచిన హను రాఘవపూడి తనపై ఇండస్ట్రీ వర్గాలు చేసిన దుష్ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తను కథ బాగా చెబుతాడు కానీ సినిమా తీయలేడనే ప్రచారం జరిగిందట. తనని నమ్మొద్దని కూడాచెప్పారని వాపోయాడు. ఈ ప్రచారం చేసిన వాళ్లెవరోఎ కూడా తనకు తెలుసునని, తనకు ఎదురు పడిన సందర్భంలో వారిని ఈ విషయంపై గట్టిగానే నిలదీస్తానని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే త్వరలో హను రాఘవపూడి మరో పీరియాడికల్ లవ్ స్టోరీకి శ్రీకారం చుట్టబోతున్నాడని, అందులో నేచురల్ స్టార్ నాని నటించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.