హనుమాన్ vs ఆదిపురుష్.. మరో తలనొప్పి స్టార్ట్

Update: 2022-11-21 12:07 GMT
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మొదలుపెట్టినప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు ఊహలకందని స్థాయిలో పెరిగిపోయాయి. ఈ సినిమా కనివిని ఎరుగని విధంగా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా అదే తరహాలో చెప్పారు. ముఖ్యంగా దర్శికుడు ఓం రౌత్ అయితే దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను వెండితెరపైకి తీసుకురాబోతున్నాము అని మంచి మాటలతో హైప్  పెంచారు. అయితే ఫస్ట్ లుక్ నుంచి కూడా చూసుకుంటే సినిమాకు అసలు ఏ విధంగాను హైప్ పెరిగే విధంగా కనిపించలేదు.

ఒక విధంగా దర్శకుడు ఓం రౌత్ ట్రోలర్స్ కు పని చెప్పాడు కానీ అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖ్యంగా టీజర్ అయితే ఒక భారీ షాక్ అనే చెప్పాలి. అంత భారీ బడ్జెట్ తో ఇంత తక్కువ క్వాలిటీ ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ఉండడం ఏమిటి అని అమీర్ పెట్ లో వెయ్యి రూపాయలకు కూడా ఇలాంటి గ్రాఫిక్స్ చేయరు అనే విధంగా ట్రోలింగ్స్ నడిచాయి. అయితే ఆ గాయాన్ని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు.

ఒక విధంగా అంతకంటే తక్కువ స్థాయి బడ్జెట్ తో ఏదైనా సినిమా వస్తే మాత్రం ఆది ఆదిపురుష్ డైరెక్టర్ కు తలనొప్పిగా మారుతోంది. మళ్ళీ మళ్ళీ ట్రోలింగ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తదుపరిచిత్రం హనుమాన్ కు సంబంధించిన టీజర్ జూ విడుదల చేశారు. ఈ సినిమాను కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరపైకి తీసుకువస్తున్నారు.

అయితే ఇందులో ఉన్న గ్రాఫిక్స్ చూస్తే మాత్రం మినిమమ్ బారి బడ్జెట్ సినిమాకు తగ్గట్టుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. అంత చిన్న సినిమా అంత అనుభవం తక్కువ ఉన్న దర్శకుడు అలాంటి విజువల్స్ ను చూపిస్తూ ఉంటే 550 కోట్ల బడ్జెట్ తో ఆది పురుష సినిమాకు అంతా నాణ్యతలేని గ్రాఫిక్స్ ఎలా వాడారో అర్థం కావడం లేదు అనే విధంగా ఆదిపురుష్ దర్శకుడికి కౌంటర్ అయితే ఇస్తున్నారు.

సినిమా గ్రాఫిక్స్ అంటే ఇలా ఉండాలి అని, ఎందుకు పెట్టావు అంత బడ్జెట్ అని మీమ్స్ తో ఓం రౌత్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్రాఫిక్స్ పనుల కోసమే ఆదిపురుష్ టీమ్ చాలా సమయం అయితే తీసుకుంది. సమ్మర్ తర్వాత జూన్లో ఆదిపురుష్ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి రీ వర్క్ లో చిత్ర యూనిట్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News