టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ `పక్కా కమర్షియల్`. మారుతి దర్శకుడు. రాశిఖన్నా హీరోయిన్. స్టార్ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్ లపై బన్నీ వాసు ఈ మూవీని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఈ నెల 12న ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.
సినిమా మారుతి మార్కు కామెడీ, గోపీచంద్ మార్కు యాక్షన్ అంశాలతో తెరకెక్కింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ హిలేరియస్ గా వుండటంతో సినిమాపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. సినిమా పక్కాగా సిద్ధం కావడంతో ఈ మూవీని జూలై 1న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల పరంగా చిత్ర బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రేక్షకులకు టికెట్ రేట్లు భారంగా మారడంతో ఇటీవల విడుదల పెద్ద చిత్రాలకు ప్రేక్షకులు పెద్దగా రావడం లేదు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నఈ మూవీ బృందం టికెట్ రేట్లు మా సినిమాకు సామాన్యులకు అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకున్నామని, భారీగా పెరిగిన రేట్లని తగ్గించి అందుబాటు ధరలో వుంచామని నిర్మాత బన్నీవాసు ప్రకటించారు. ఇదిలా వుంటే వరుస ఫ్లాపులతో గత కొంత కాలంగా పతమతమవుతున్న హీరో గోపీచంద్, సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మారుతికి ఈ మూవీ అత్యంత కీలకంగా మారింది.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరింత క్రేజ్, బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రంలోకి కీలక అతిథి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోందని తెలిసింది. ఇక కథకు కీకంగా నిలిచే పాత్రలో `నేనింతే` ఫేమ్ శ్రియా గౌతమ్ నటించిందని, మరో హీరోయిన్ చిత్ర శుక్లా కూడా నటించిందని తాజా సమాచారం. స్పెషల్ స్టోరీతో స్పెషల్ క్యారెక్టర్ లతో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 1న సమ్ ధింగ్ స్పెషల్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.