'వెన్నెల' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన దేవా కట్టా.. 'ప్రస్థానం' సినిమాతో సంచలనం సృష్టించాడు. 'ఆటోనగర్ సూర్య' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా దేవకట్టా కు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో 'డైనమైట్' అనే రీమేక్ సినిమా చేసి ప్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత హిందీలో చేసిన 'ప్రస్థానం' సినిమా కూడా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాయి తేజ్ తో 'రిపబ్లిక్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని దేవా కట్టా ఎదురు చూస్తున్నారు.
ఈరోజు డైనమిక్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా 'రిపబ్లిక్' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ చిత్రంలో సాయి తేజ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలావుండగా దేవకట్టా 'ఇంద్రప్రస్థం' అనే వర్కింగ్ టైటిల్ తో ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య స్నేహం మరియు రాజకీయ వైరం ఆధారంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ రాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పొలిటికల్ ఐకాన్స్ నుండి ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దేవా కట్ట ఇదివరకే ప్రకటించారు. మరి డైనమిక్ డైరెక్టర్ దేవకట్టా 'రిపబ్లిక్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి.. 'ఇంద్రప్రస్థం' తో దాన్ని కొనసాగిస్తాడేమో చూడాలి.