పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే పవన్ `భీమ్లా నాయక్` చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లారు. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఇదే ఏడాది అన్ని చిత్రాలు పూర్తిచేసి వచ్చే ఏడాది కొత్త కమిట్ మెంట్లతో బిజీ అవ్వాలని ప్లాన్ చేసారు.
అయితే `హరిహర వీరమల్లు` యూనిట్ సభ్యులు కోవిడ్ బారిన పడటంతో షూటింగ్ బ్రేక్ పడింది. దీంతో పవన్ పూర్తిగా భీ`మ్లా నాయక్` సినిమాకే డేట్లు కేటాయించారు. దాదాపు ఆ సినిమా చిత్రీకరణ క్లైమాక్స్ కి చేరుకుంది. దీంతో `హరి హర వీరమల్లు` బ్యాలెన్స్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి ప్రారంభించాలని దానికి తగ్గట్లు పవన్ డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ బ్రేక్ కి తాజాగా మరో బలమైన కారణం కూడా తెరపైకి వచ్చింది.
`హరి హర వీరమల్లు` పిరియాడిక్ మూవీ కావడంతో భారీ సెట్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అందుకు బడ్జెట్ ఎక్కువగానే కేటాయించాల్సి ఉంది. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువగానే ఖర్చు అవుతుందని..నిధులు సమకూర్చుకోవడం కూడా డిలే అవ్వడంతో వీరమల్లు ఇన్నాళ్లు వాయిదా వేసినట్లు వినిపిస్తోంది. డిసెంబర్ కల్లా అన్ని సెట్ అయిన నేపథ్యంలో తాజాగా పవన్ డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.