చారిత్రక నేపథ్యం కానీ రాజుల కాలం నాటి కథల్ని కానీ ఎంచుకుంటే అందుకు తగ్గట్టు సినిమాల్ని అత్యంత భారీతనంతో కథన బలంతో సినిమాల్ని తీయాల్సి ఉంటుంది. సాధారణ మాస్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే రిస్క్ చాలా చాలా ఎక్కువ. భారీగా పెట్టుబడుల్ని వెదజల్లితేనే సరిపోదు.. కథ-కథనం పరంగా చాలా జాగ్రత్తలు అవసరం. పైగా టెక్నాలజీతో పని చేస్తూ సత్తా చాటాల్సి ఉంటుంది. విజువల్ గ్రాఫిక్స్ పనితనాన్ని కథను డైవర్ట్ చేయకుండా ఉపయోగించాల్సి ఉంటుంది.
అయితే ఇలాంటి సవాళ్లను అధిగమిస్తూనే.. పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్లిన బ్రిటీష్ వాళ్ల ఆగడాలపై భారతీయ యోధుడి పోరాటం నేపథ్యాన్ని ఎంచుకుని నాటి వాతావరణాన్ని ప్రతిఫలిస్తూ తెరపై అందమైన విజువల్ ట్రీట్ ని ఇచ్చేందుకు క్రిష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలుస్తోంది. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందించేందుకు భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని సమాచారం.
అయితే ఇలాంటి భారీ సినిమాకి ఆరంగేట్ర ఎత్తుగడ బాగానే ఉన్నా క్రమక్రమంగా గ్రాఫ్ ని పెంచుకుంటూ చివరికి క్లైమాక్స్ కి వచ్చేప్పటికి కుర్చీ అంచుపై కూచుని ఎగ్జయిటయిపోయేంతగా ఆడియెన్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో క్రిష్ ఇంతకుముందు పొరపాటు చేశాడన్న విమర్శ ఉంది. బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కించిన క్రిష్ కథన బలం బావున్నా కానీ ఆరంభం ఉన్న గ్రిప్ ని చివరిలో ప్రదర్శించలేకపోయాడని క్లైమాక్స్ కి వచ్చేప్పటికి గ్రాప్ డౌన్ అయ్యిందని క్రిటిక్స్ విమర్శించారు. అయితే ఈసారి ఆ తప్పిదం రిపీట్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడని తెలిసింది.
విమర్శల్ని పాజిటివ్ గా తీసుకుని తన పని తాను చేసుకుపోయే దర్శకుడిగా క్రిష్ కి పేరుంది. మొన్నటి టీజర్ తో ఒక్కసారిగా హరి హర వీరమల్లుపై హైప్ పెంచడంలో క్రిష్ సఫలమయ్యారు. అయితే టీజర్ తోనే క్లారిటీ రాదు. ట్రైలర్ తో రక్తి కట్టించాలి. ఆ తర్వాత సినిమా ఆద్యంతం అదే గ్రిప్ తో చూపించి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాలి. సంక్రాంతి 2022 రేసులో భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీగా హరి హర వీర మల్లు భారీ కాంపిటీసన్ నడుమ రిలీజవుతోంది. ఈ వార్ లో వీరమల్లుని విజేతగా నిలబెడతాడా లేదా చూడాలి.