నందమూరి హరికృష్ణ నిన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. హరికృష్ణ మరణం నందమూరి ఫ్యామిలీతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచి వేసింది. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్‌లు దుఖంలో మునిగి పోయారు. తండ్రిని కోల్పోవడంతో వారు తీవ్ర భావోద్వేగంకు గురవుతున్నారు. ఈ సమయంలోనే హరికృష్ణ ఇద్దరు కొడుకులతో నటించాలనే కోరిక తీరకుండానే చనిపోయారు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఈమద్య కాలంలో సన్నిహితుల వద్ద హరికృష్ణ పలు సార్లు ఇద్దరు కొడుకులతో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని కొడుకుల వద్ద కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.
తండ్రి కోరికను తీర్చేందుకు కళ్యాణ్ రామ్ ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లుగా నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణలతో ఒక చిత్రం నిర్మించి, అందులో తాను నటించాలని కోరుకున్నాడు. నందమూరి మల్టీస్టారర్ కోసం మంచి స్క్రిప్ట్‌ను సిద్దం చేయాలంటూ ఇప్పటికే కళ్యాణ్ రామ్ పలువురు రచయితలకు సూచించినట్లుగా సమాచారం అందుతుంది. ఇంతలోనే హరికృష్ణ మృతి చెందడంతో నందమూరి మల్టీస్టారర్ చిత్రం చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కలేదు.
చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత కాలంలో రాజకీయాలతో బిజీగా మారడం, రాజ్యసభ సభ్యుడిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉండటంతో సినిమాలు చేసే అవకాశం దక్కలేదు. ఈమద్య కాలంలో హరికృష్ణ క్రియాశీలక రాజకీయాలకు మెల్ల మెల్లగా దూరం అవుతూ వచ్చారు. ఈ సమయంలోనే మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని అనుకున్నారట. ఇంతలోనే ఇలా జరిగిందని హరికృష్ణతో సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు హరికృష్ణ మరణం పెద్ద లోటు అని చెప్పుకోవచ్చు.