హరిహర వీరమల్లు.. పవర్ఫుల్ షెడ్యూల్!

Update: 2023-01-07 10:31 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై ఫ్యాన్స్ లో అయితే అంచనాల స్థాయి రోజురోజుకు అనంతంగా పెరిగిపోతున్నాయి. ఆమధ్య సినిమా ఆగిపోయింది అని కొన్ని రకాల కథనాలు కొంత కలవరపరిచినప్పటికీ కూడా నిర్మాత దర్శకుడు ఈ సినిమాను ఎంత అలస్యమైనా కూడా పక్క ప్రణాళికతో పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తిన్నాడు.

ఈ సినిమా 16వ శతాబ్దానికి సంబంధించిన ఒక చారిత్రాత్మగా అంశం నేపథ్యంలో తెరపైకి రాబోతోంది. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో రకాల అంశాలు కూడా ఈ కథలో హైలెట్ చేయబోతున్నారట.

పవన్ కళ్యాణ్ ఒక వీర యోధుడిగా వెండితెరపై కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.హైదరాబాదులో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో పవన్ కళ్యాణ్ బాబికి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దాదాపు రెండు వారాలపాటు కొనసాగే ఈ షూటింగ్లో పవన్ కళ్యాణ్ ఒక పది రోజులపాటు బిజీ కానున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఆమె మొగల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక ప్రిన్సెస్ పాత్రలో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే తనకు సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చేసింది.

త్వరలో స్టార్ట్ కాబోయే షెడ్యూల్లో కూడా ఆమె పాల్గొనబోతున్నట్లు సమాచారం. దర్శకుడు క్రిష్ అయితే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ ను పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఉండే సమయాన్ని బట్టి పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇక సినిమాను ఎలాగైనా ఈ ఏడాది దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. మరి ఆ లోపు సినిమా ఫినిష్ అవుతుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News