హీరోయిన్ హరిప్రియ టాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చేస్తోంది. గతంలో చిన్న సినిమాలలో కనిపించిన ఈ భామ.. పిల్ల జమిందార్ చిత్రంతో బాగానే ఆకట్టుకున్నా పెద్ద హీరోలతో అవకాశాలు పొందలేకపోయింది. ప్రస్తుతం కన్నడలో ఫుల్ బిజీ అయిపోయిన హరిప్రియ.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం జైసింహా తో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తోంది.
కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే తన పాత్ర షూటింగ్ కూడా పూర్తి చేసేసిన ఈ భామ.. తనలోని అల్లరి యాంగిల్ ను చూపిస్తానని చెబుతోంది. ఇప్పటివరకూ తను చేయని ఓ కొత్త తరహా రోల్ కావడంతో ఎంజాయ్ చేశానని అంటున్న హరిప్రియ.. తన క్యారెక్టర్ కు బోలెడంత ఆటిట్యూడ్ ఉంటుందని చెబుతోంది. తాను దర్శకుల ఆర్టిస్టునని.. వారు ఇచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుటానని చెబుతున్న ఈ భామ.. కేఎస్ రవికుమార్ ప్రతీ సీన్ ని మూమెంట్ ను యాక్ట్ చేసి చూపిస్తారని పొగిడేసింది.
ఇక హీరో నందమూరి బాలకృష్ణ అయితే మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అంటున్న హరిప్రియ.. ఆయన డెడికేషన్ అద్భుతం అని చెప్పింది. రిహార్సల్స్ చేయడానికి కూడా ఎలాంటి నామోషీలు ఆయన పెట్టుకోరని.. ఆయన నడిచే లైబ్రరీ లాంటి వారని.. లిటరేచర్ పై బోలెడంత పట్టు ఉందని చెప్పిన ఈ హీరోయిన్.. ఆధ్యాత్మికతపై కూడా చాలానే మాటలు చెప్పారని.. ఆయన చెప్పిన మాటలు తనపై బోలెడంత ప్రభావం చూపాయని హరిప్రియ అంటోంది.